శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జూలై 14 మధ్యాహ్నం 2:35 గంటలకు చంద్రయాన్-3 ను ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో). నేడు చంద్రయాన్-3 వ్యోమనౌకతో గూడిన ఎల్.వి.ఎం-3 (జి.ఎస్.ఎల్.వి మార్క్ 3) రాకెట్ ను రెండవ ప్రయోగవేదికకు తరలించిన తర్వాత ఇస్రో ఈ ప్రకటన చేసింది. ఈ ప్రయోగాన్ని జూలై 13న నిర్వహిస్తామని ఇస్రో గతంలో చెప్పింది.
ఆ రోజున [జూలై 14] ప్రయోగం జరిగితే, ఆగస్టు చివరి వారంలో చంద్రయాన్-3 చంద్రుడిని చేరుకుంటుంది. ల్యాండింగ్ ఆగస్ట్ 23 లేదా 24 న జరుగుతుంది. ఈ రెండు తేదీలలో కుదరకపోతే, మరో నెల రోజులు వేచి ఉండి సెప్టెంబర్‌లో దిగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం చెప్పారు.
చంద్రయాన్-3 వ్యోమనౌక లో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్ మరియు రోవర్ అనే మూడు విభాగాలు ఉన్నాయి. చంద్రయాన్-2కి కొనసాగింపు ప్రయోగమైన చంద్రయాన్-3 యాత్రలో చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ మాడ్యూల్ సురక్షితంగా దిగుతుంది. మరియు రోవర్ చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ, మట్టి నమూనాలను సేకరించి పరిశోధనలను చేస్తుంది.
ఈ యాత్రలో, చంద్ర ఉపరితలంపై ఉన్న రాళ్ళు, ధూళితో కూడిన మట్టి (దాన్ని మూన్ రెగోలిత్ అని అంటారు) యొక్క ప్లాస్మా పర్యావరణం మరియు మూలక కూర్పుల ఉష్ణ-భౌతిక (థెర్మో ఫిజికల్) లక్షణాలను, మరియూ చంద్ర భూకంపాన్ని అధ్యయనం చేయడానికి అవసరమైన శాస్త్రీయ ఉపకరణాలను (పరికరాలు) చంద్రయాన్-3 తీసుకువెళుతుంది. భూమి యొక్క స్పెక్ట్రో-పోలరిమెట్రిక్ సిగ్నేచర్లను చంద్ర కక్ష్య నుండి అధ్యయనం చేయడానికి ఒక ప్రయోగాత్మక పరికరం - స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ ఉపకరణాన్ని ప్రొపల్షన్ మాడ్యూల్లో అమరుస్తారు. ఈ ఉపకరణం ప్రొపల్షన్ మాడ్యూల్ తో పాటు 100 కి.మీ చంద్ర కక్ష్యలో పరిభ్రమిస్తూ అధ్యయనం చేస్తుంది.
చంద్రయాన్ -3 లోని సాంకేతిక ఉపకరణాలు :
- ల్యాండర్ లో అమర్చే ఉపకరణాలు : ఉష్ణ వాహకత మరియు ఉష్ణోగ్రతను కొలవడానికి 'చంద్ర ఉపరితల థర్మోఫిజికల్ ప్రయోగం'; ల్యాండింగ్ సైట్ చుట్టూ భూకంపాన్ని కొలవడానికి 'చంద్ర భూకంప చర్య కోసం పరికరం'; మరియు ప్లాస్మా సాంద్రత మరియు దాని వైవిధ్యాలను అంచనా వేయడానికిగాను 'లాంగ్‌ముయిర్ ప్రోబ్'. మరియూ, చంద్ర లేజర్ శ్రేణి అధ్యయనాల కోసం నాసా ( అమెరిక యొక్క స్పేస్ ఏజెన్సీ) యొక్క పాసివ్ లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే ఉపకరణాన్ని చంద్రయాన్-3 లో అమర్చుతారు.
- రోవర్ లో అమర్చే ఉపకరణాలు : ల్యాండింగ్ సైట్ సమీపంలోని మూలక కూర్పును పొందడం కోసం 'ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్' మరియు 'లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ'
ఎల్.వి.ఎం-3 ఆఖరి దశ చంద్రయాన్-3ని సుమారు 170 x 36,500 కి.మీ ఎలిప్టిక్ పార్కింగ్ కక్ష్యలో ఉంచుతుంది. ల్యాండర్/రోవర్ ను ప్రొపల్షన్ మాడ్యూల్ ను 100 కి.మీ వృత్తాకార ధ్రువ చంద్ర కక్ష్యలోకి తీసుకువచ్చి వేరు చేస్తుంది. ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో 69.37 S, 32.35 E సమీపంలో చంద్రుని ఉపరితలంపై రోవర్‌తో కుదుపులు లేకుండా దిగుతుంది. టచ్‌డౌన్ వేగం 2 m/s నిలువుగా మరియు 0.5 m/s క్షితిజ సమాంతరంగా ఉండేలా ప్రణాళిక చేయబడింది. రోవర్‌ను మోహరించగలదు. రోవర్ ఆ ప్రాంతంలో సంచరించే సమయంలో చంద్రుని ఉపరితలంపై రసాయన విశ్లేషణను నిర్వహిస్తుంది. భూమితో కమ్యూనికేషన్‌లను ప్రారంభించడానికి ప్రొపల్షన్ మాడ్యూల్ / కమ్యూనికేషన్స్ రిలే కొరకు చంద్ర కక్ష్యలోనే ఉంటుంది.
సెప్టెంబరు 2019లో చంద్రునిపై చంద్రయాన్-2 ల్యాండర్ 'విక్రమ్' సాఫ్ట్-ల్యాండింగ్ చేయడంలో విఫలమైనందున, చంద్రయాన్-3 ల్యాండర్ రూపకల్పనలో మెరుగుపరిచిన నూతన సాంకేతికతలను ఉపయోగించింది. సురక్షితమైన మరియు మృదువైన ల్యాండింగ్‌ను ప్రదర్శించడం; చంద్రునిపై రోవర్ పర్యటనను ప్రదర్శించడం మరియు అక్కడి పరిస్థితులలో శాస్త్రీయ ప్రయోగాలు చేయడం వంటి చంద్రయాన్-3 యాత్ర లక్ష్యాలను సాధించటంలో ఇస్రో ఘన విజయం సాధించాలని కోరుకుందాం.
No comments:
Post a Comment