శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి, జులై 30న PSLV-C56 ద్వారా DS-SAR ఉపగ్రహన్ని, మరియు ఆరు ఇతర ఉపగ్రహాలను ప్రయోగించటానికి భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) అన్నహాలు చేస్తున్నది. చంద్రఫయాన్-3 మిషన్‌ను తర్వాత, కేవలం 15 రోజుల వ్యవధిలో ఇస్రో తన తదుపరి పెద్ద ప్రయోగానికి సిద్ధమవుతోంది. మొదటి దశలో ఘన రాకెట్ స్ట్రాప్-ఆన్ మోటార్లు లేకుండా PSLVని ప్రయోగిస్తారు.
ఈ ప్రయోగంలో ప్రాథమిక పేలోడ్: DS-SAR ఉపగ్రహం, 360 కిలోల బరువు ఉంటుంది, ఈ ఉపగ్రహం సింథటిక్ ఎపర్చరు రాడార్‌ను కలిగి ఉంది. సింగపూర్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న DSTA మరియు ST ఇంజనీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడిన 360 కిలోల బరువు ఉన్న DS-SAR ఉపగ్రహన్ని ప్రయోగిస్తారు. ఈ ఉపగ్రహం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) అభివృద్ధి చేసిన సింథటిక్ ఎపర్చరు రాడార్ (SAR) పేలోడ్‌ను కలిగి ఉంది. ఈ అధునాతన సాంకేతికతతో రూపొందించబడిన ఈ ఉపగ్రహం, పగలు రాత్రి తేడా లేకుండా వాతావరణాన్ని పరిశీలించే సత్తా కలిగియున్నది. కక్ష్యలో పని చేయటం ప్రారంభంచిన తర్వాత, సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీల ఉపగ్రహ చిత్రాల అవసరాలకు మద్దతు ఇస్తుంది. మరియు ST ఇంజనీరింగ్ యొక్క వాణిజ్య వినియోగదారుల కోసం బహుళ-మోడల్ మరియు అధిక ప్రతిస్పందన చిత్రాలను మరియు జియోస్పేషియల్ సేవలను అందిస్తుంది.
DS-SARతో పాటు క్రింద పేర్కొనబడిన ఆరు ఉపగ్రహాలను కూడా ప్రయోగిస్తారు.
1). 23 కిలోల Velox-AM, మైక్రోసాటిలైట్;
2). ప్రయోగాత్మక ఉపగ్రహం ఆర్కేడ్ (Atmospheric Coupling and Dynamics Explorer -ARCADE); 3). టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ పేలోడ్‌తో కూడిన 3U నానోసాటిలైట్ SCOOB-II;
4). పట్టణ మరియు మారుమూల ప్రాంతాలలో IoT కనెక్టివిటీని ఇవ్వటానికి ఉపయోగపడే న్యూస్పేస్ కు చెందిన
న్యూలియన్ (NuLIoN);
5). భూ సమీప కక్ష్య లోకి పంపబడే ఒక అధునాతన 3U నానోసాటిలైట్ గలాసియా-2;
6). అంతర్జాతీయ సహకారంతో అభివృద్ధి చేయబడిన ఉపగ్రహం ORB-12 స్ట్రైడర్.
ఈ ప్రయోగం ద్వారా, అంతరిక్ష సాంకేతికతలో భారతదేశం యొక్క సామర్థ్యాలను ఇస్రో మరొకసారి, ప్రదర్శిస్తుందని ఆశిద్దాం.
రెండవ దశ వరకు అనుసంధానం చేయబడిన PSLVని అనుసంధాన భవనం నుండి ప్రయోగ వేదికకు రైకు పట్టాలపై తరలిస్తున్న దృశ్యం |
No comments:
Post a Comment