Friday, March 10, 2023

ISRO-NASA పరస్పర సహకారంతో రూపొందించిన తొలి ఉపగ్రహం NISAR గురించి ...

భూమి మరియు మారుతున్న వాతావరణం గురించి దాని అవగాహనను పెంపొందించే ప్రయత్నంలో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్ - ఇస్రో) మార్చి 8  బెంగళూరులో నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR)ని అందుకుందిఅంతరిక్ష సహకారంలో అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో NISAR ఉపగ్రహం ఒక ప్రధాన మైలురాయి గా నిలుస్తుంది.

పరస్పర  సహకారంతో భూమి పరిశీలన ఉపగ్రహాన్ని నిర్మించాలనే ఆలోచనతో 2014లో  రెండు అంతరిక్ష సంస్థలు 2014లో భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశాయి. అలా ఏర్పడిన సహకారంతో  నిర్మింపబడిన  NISAR, 2024లో అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు























NISAR
ఉపగ్రహం గురించిన వివరాలు :

    • భారతదేశం మరియు USA యొక్క అంతరిక్ష ఏజెన్సీల మధ్య ఉమ్మడి సహకారంలో NISAR ఒకటి. ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్‌లలో ఒకటిగా కూడా ఉంటుందని భావిస్తున్నారు.
    • సింథటిక్ ఎపర్చరు రాడార్, అత్యంత అధిక రిజల్యూషన్ చిత్రాలను రూపొందించడానికి ఉపయోగించే అత్యంత అధునాతన పరికరం. ఎంతటి దట్టమైన మేఘాలున్నా, చిమ్మ చీకటైనా దీని పైకి అవరోధం కావు. సంవత్సరం పొడవునా, పగలు మరియు రాత్రి అన్న తేడా లేకుండా, ఉపగ్రహం డేటాను సేకరిస్తుంది.
    • 2,800 కిలోగ్రాముల బరువుండే NISAR ఉపగ్రహం రెండు-ఫ్రీక్వెన్సీల రాడార్. దీనిలో  L-బ్యాండ్ మరియు S-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ (SAR) సాధనాలు ఉన్నాయి.
    • L-బ్యాండ్ (24 సెంటీమీటర్ల ఫ్రీక్వెన్సీ) ని NASA నిర్మించగా, S-బ్యాండ్ (13 సెంటీమీటర్లు) ను ఇస్రో రూపొందించింది
    • L-బ్యాండ్‌తో పాటు, రాడార్ రిఫ్లెక్టర్ యాంటెన్నా, డిప్లోయబుల్ బూమ్, సైన్స్ డేటా కోసం అధిక-రేటు కమ్యూనికేషన్ సబ్‌సిస్టమ్, GPS రిసీవర్లు, సాలిడ్-స్టేట్ రికార్డర్ మరియు పేలోడ్ డేటా సబ్‌సిస్టమ్‌ను NASA అందిస్తోంది.
    • స్పేస్‌క్రాఫ్ట్ బస్, ప్రయోగ రాకెట్, దాని అనుబంధ ప్రయోగ  సేవలు మొదలైన వాటిని   ఇస్రో అందిస్తుంది.
    • NISAR ప్రయోగం జనవరి 2024లో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ధ్రువ కక్ష్యలోకి చేరుతుందని భావిస్తున్నారుశాస్త్రవేత్తలు సుమారు మూడేళ్లపాటు ఉపగ్రహ సహాయంతో సమాచారాన్ని సేకరించగలరుభూ సమీప కక్ష్యలో (LEO) భూమి చుట్టూ పరిభ్రమించే NISSAR ఉపగ్రహం, 12 రోజుల్లో మొత్తం భూగోళాన్ని మ్యాప్ చేస్తుంది.
    • NISAR భూమి యొక్క ఉపరితల మార్పులు, సహజ ప్రమాదాలు మరియు పర్యావరణ వ్యవస్థ అవాంతరాలకు సంబంధించిన అన్ని అవసరమైన సమాచారాన్ని కలిగి ఉన్న డేటా బ్యాంక్‌ను రూపొందించడంలో సహాయం చేస్తుంది.
  • కక్ష్యలో NISAR (ఊహా చిత్రం) 
    • భూమిపై ఉన్న  అటవీ మరియు వ్యవసాయ ప్రాంతాల పరిశీలనలు, వాతావరణం మరియు వృక్షజాలం మధ్య కార్బన్ మార్పిడి, వగైరా అంశాలపై శాస్త్రవేత్తల పరిజ్ఞానాన్ని మెరుగుపరుస్తాయి. శాస్త్రవేత్తలు రూపొందించిన భవిష్యత్ వాతావరణ  నమూనాలకు  సంబంధిన అనిశ్చితులను తగ్గిస్తాయి.
    • వాతావరణ మార్పు మరియు భూమి యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో NISAR డేటా సహాయపడుతుందిఅంతేకాకుండా, ఉపగ్రహం నుండి పొందిన ఫలితాలు పంట పెరుగుదల, నేల తేమ మరియు భూ వినియోగ మార్పుల గురించి సమాచారాన్ని అందించడం ద్వారా వ్యవసాయ నిర్వహణ మరియు ఆహార భద్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
    • వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడంలో, ప్రకృతి వైపరీత్యాల విషయంలో రిస్క్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరచడంలో, మౌళిక సదుపాయాల పర్యవేక్షణలో మరియు వాతావరణ మార్పుల  ప్రభావాన్ని అధ్యయనం చేయటానికి సహాయం చేస్తుంది.


Wednesday, March 1, 2023

గగన్‌యాన్ యొక్క సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్ స్ట్రక్చర్ అసెంబ్లీని ఇస్రోకు అందించిన మంజీరా మెషిన్ బిల్డర్స్ —— మొదటి అబార్ట్ పరీక్ష దిశగా ఇదొక ముందు అడుగు

బెంగళూరు, ఫిబ్రవరి 25, 2023: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్‌లో భాగంగా ప్రత్యేక పరీక్ష వాహనం (టెస్ట్ వెహికల్) ని ఉపయోగించి అబార్ట్ పరీక్షను నిర్వహించేందుకు ఒక అడుగు ముందుకు వేసింది. ఫూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి  సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్‌ను తిరువనంతపురంలోని విక్రం సారాభాయి స్పేస్ సెంటర్ (వి.ఎస్.ఎస్.సీ) రూపొందించగా, హైదరాబాద్‌లోని మంజీరా మెషిన్ బిల్డర్స్  తన  ఫ్యాక్టరీలో  తయారు చేసింది.

సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్, మానవ సహిత యాత్రలో వ్యోమగాములు కూర్చుండే  మాడ్యూల్ లాగానే ఉంటుందిఆయితే ప్రయోగ సమయంలో ఏర్పరచే ప్రెషర్ (ఒత్తిడి) ఉండదు. ఒత్తిడి లేని సిబ్బంది మాడ్యూల్ తో పారాచూట్ సిస్టమ్స్ మరియు పైరోస్ వంటి ప్రధాన వ్యవస్థల ఇంటర్‌ఫేస్‌లు సిములేట్ చేయబడతాయి మాడ్యూల్ ను వివిధ సబ్‌సిస్టమ్‌లతోపాటు క్రూ ఎస్కేప్ సిస్టమ్ కు సంబంధించిన  వివిధ పరిక్షలకు గురిచేసి, అంతరిక్ష పరిస్తితులకు తట్టుకొని ఉద్దేశించిన లక్ష్యాలను చేరుకోగలదో, లేదో అని నిర్ధారిస్తారు.  

సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్ స్ట్రక్చర్ అసెంబ్లీ

వ్యోమగాములతో జరిగే ప్రయోగంలో ఎదైనా ప్రమాదం వాటిల్లితే అబార్ట్ వ్యస్థ ద్వారా  వ్యోమగాములు  ప్రాణాపాయ స్తితినుండి సూక్షితంగా భూమి పైకి చెరుతారు. టెస్ట్ వెహికల్ నుండి వేరు చేయబడిన/విడిపోయిన తర్వాత, మాడ్యూల్ భూఆక్షణ వల్ల  కిందికి పయనిస్తుంది.


సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్ పై వివిధ పరిక్షలను నిర్వహించేందుకు శ్రీహరికోటలో ఎర్పాట్లు జరుగుతున్నాయని వి.ఎస్.ఎస్.సీ డైరెక్టర్  ఉన్నికృష్ణన్ నాయర్  చెప్పారుగగన్‌యాన్‌లో భాగంగా అబార్ట్ టెస్ట్ లో స్పెషల్ టెస్ట్ వెహికల్ నుండి 11 కి.మీ (సముద్ర మట్టం నుండి) ఎత్తులో సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్‌ ని వేరై, మరో 5, 6 కి.మీ ఎత్తుకు వెళ్ళి కిరకు దిగుతుంది. క్రమంలో అవరోహణ దశ, పారాచూట్ విస్తరణ మరియు రికవరీ (సురక్షితంగా సముద్రం నుండి ఒడ్డుకు చేర్చటం)   వంటి  వివిధ  అంశాలను కూడా నిర్ధారిస్తారు


టెస్ట్ వెహికల్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్-1 (టీవీ-టీడి-1) ప్రయోగం సంవత్సరం మొదటి అర్ధభాగంలో తాత్కాలికంగా ప్రణాళిక చేయబడింది, గగన్‌యాన్ కు సంబంధించిన మొదటి మానవ రహిత (అన్‌క్రూడ్ మిషన్‌) కు ముందు నిర్వహించాలని ఇస్రో యోచిస్తున్న అనేక పరీక్షలలో ఇది మొదటిది. ప్రయోగం జరిగేటప్పుడు, శ్రీహరికోటలోని రాడార్ వ్యవస్థలు  ట్రాకింగ్ చేస్తాయి పరిక్షలో విజయం సాధించడం వల్ల అనేక ఇతర ప్రక్రియలను వేగవంతం చేసే అవకాశం  ఇస్రోకు లభిస్తుంది.

Monday, February 27, 2023

విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టడాన్ని నివారించగల ఇస్రో ఉపగ్రహం

 ఫిబ్రవరి 27, 2023: ఫిబ్రవరి 10 జరిగిన ఇస్రో యొక్క చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం యొక్క రెండవ ప్రయోగంలో (ఎస్.ఎస్.ఎల్.వీ -డీ2)  భూసమీప కక్ష్యలోకి పంపబడిన ..ఎస్-07 ఉపగ్రహం, 'స్పెక్ట్రమ్ మానిటరింగ్ పేలోడ్' అనే ఒక పరికరాన్ని కలిగి ఉంది. ఇది విమానాల కదలికను  పసిగట్టగల ఒక  సిగ్నల్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ముంబాయిలోని వీ.జే.టి.. సంస్థ నిర్వహిస్తున్న  మూడు రోజుల సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్ 'టెక్నోవాంజా' లో విలేకరులతో మాట్లాడుతూ, ఇస్రో యొక్క అహ్మదాబాద్‌కు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ రూపొందించిన పరికరం విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టడాన్ని నివారించడంలో సహాయపడుతుందని, తిరువనంతపురం లోని ఇస్రో యొక్క ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ డైరెక్టర్ శ్రీ డి. శాందయాళ్ దేవ్ అన్నారు. పరికరం ఇప్పుడు ప్రయోగదశలో ఉందని ఆయన చెప్పారు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు ముంబైలోని మాతుంగాలోని వీర్‌మాత జీజాబాయి టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (వీజేటీఐ)లో మూడు రోజుల సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్ 'టెక్నోవాంజా' ప్రదర్శనను ఏర్పాటు చేసింది. వివిధ ఉపగ్రహ వాహక రాకెట్లు మరియు ఉపగ్రహాలు, మానవరూప రోబోట్, స్మార్ట్ స్పేస్ రోబోట్, స్పేస్ సెన్సార్లు మరియు ఇతర సంక్లిష్ఠ ఉపకరణాలను ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థులుఇతరలు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం యొక్క పురోగతి మరియు విశ్వంలోని అద్భుతాలను గురించి తెలుసుకోవడానికి ప్రదర్శన అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది.


వన్ వెబ్ సంస్థ యొక్క 36 ఉపగ్రహాలు మార్చి చివరిలో ఎల్.వీ.ఎం-3 రాకెట్ ద్వారా ప్రయోగించబడతాయని, మరియు చంద్రయాన్-3 జూన్‌లో  ప్రయోగించబడే అవకాశం ఉందని శ్రీ శాందయాళ్ దేవ్ అన్నారు. దీనికి సంబంధించిన అన్ని గ్రౌండ్ టెస్ట్‌లు విజయవంతంగా నిర్వహించబడ్డాయని ఆయన చెప్పారు. హెలికాప్టర్ నుండి పునర్వినియోగ ప్రయోగ వాహనం యొక్క ల్యాండింగ్ ట్రయల్ కూడా త్వరలో జరుగుతుందని ఆయన వివరించారు.