Sunday, April 23, 2023

నూతన భారత అంతరిక్ష విధానం: ఇకపై పరిశోధన మరియూ అభివృద్ధిపై మాత్రమే ఇస్రో దృష్టి సారిస్తుంది. రాకెట్లు, ఉపగ్రహాల తయారీ, వాటి ప్రయోగాలకు అవసరమైన వివిధ వసతుల ఏర్పాటు, నిర్వహణ వంటి పనులు ప్రభుత్వేతర సంస్థలు చేస్తాయి

2023, ఏప్రిల్ 6 ప్రభుత్వం ప్రకటించబడిన కొత్త భారత అంతరిక్ష విధానం ప్రకారం, ఇకపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో, అంతరిక్ష వ్యవస్థల తయారీ మరియూ కార్యాచరణ భాద్యతల నుండి వైదొలగి, అధునాతన సాంకేతికతలలో పరిశోధన మరియు అభివృద్ధిపై తన శక్తులను కేంద్రీకరిస్తుంది. భద్రతకు సంబంధించిన కేంద కేబినెట్ కమిటీ ఆమోదించిన 'ఇండియన్ స్పేస్ పాలసీ-2023' ప్రకారం, భూస్థిర కక్ష్య ద్వారా జాతీయ మరియు అంతర్జాతీయ అంతరిక్ష-ఆధారిత కమ్యూనికేషన్ సేవలను, మరియూ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించే భూసమీప (low earth orbit) మరియూ మధ్యస్థ భూకక్ష్యల్లోని (medium earth orbit) ఉపగ్రహ అధారిత సేవలను అందించడానికి ప్రభుత్వేతర సంస్థలను (Non Government Entities-NGEs) కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. స్వీయ-యాజమాన్యం, సేకరించిన లేదా లీజుకు తీసుకుని సేవలను అందించవచ్చు. టెలిమెట్రీ, ట్రాకింగ్ మరియు కమాండ్ (TT&C) ఎర్త్ స్టేషన్‌లు మరియు ఉపగ్రహ నియంత్రణ కేంద్రాలు (Satellite Control Centres) వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి మరియు నిర్వహించడానికి ప్రభుత్వేతర సంస్థలను విధానం ప్రోత్సహిస్తుంది. ఉపగ్రహ ప్రయోగ రాకెట్లు అలాగే అంతరిక్ష రవాణా కోసం పునర్వినియోగ/పునరుద్ధరించబడిన/ పునర్నిర్మించబడిన సాంకేతికతలు మరియు వ్యవస్థల రూపకల్పన మరియు అభివృద్ధితో సహా అంతరిక్ష రవాణా వ్యవస్థలను తయారు చేయడానికి మరియు నిర్వహించడానికి విధానం ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహిస్తుంది.

కొత్త అంతరిక్ష విధానాన్ని స్వాగతించిన పారిశ్రామిక రంగం 

కొత్త అంతరిక్ష విధానాన్ని భారత పారిశ్రామిక రంగం స్వాగతించింది. " విధానం అన్ని అంతరిక్ష కార్యకలాపాలపై, ప్రత్యేకించి స్పేస్ కమ్యూనికేషన్ మరియు ఇతర అనువర్తనాలకు సంబంధించి స్పష్టతను అందిస్తుంది" అని ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ .కే. భట్ అన్నారు. భారతదేశంలో బలమైన వినూత్న మరియు ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి విధానం ఉత్ప్రేరకంగా ఉంటుందని ఆయన అన్నారు.

కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, డేటా సర్వీసెస్ మరియు లాంచ్ సర్వీసెస్ వంటి అంతరిక్ష సాంకేతికత లేదా సేవలను, పబ్లిక్ లేదా ప్రైవేట్ సెక్టార్ నుండి, భారతీయ వినియోగదారులు నేరుగాఎటువంటి అవరోధాలు లేకుండా పొందవచ్చని కూడా పాలసీ పేర్కొంది.

2020లో ఆవిష్కరించిన అంతరిక్ష రంగ సంస్కరణల ద్వారా ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యానికి మార్గం సుగమం చేసింది. సంస్కరణను అమలు చేయడానికి విస్తృతమైన విధి, విధానాలతో కొత్త అంతరిక్ష విధానం రూపొందించబడింది.  

జాతీయ అంతరిక్ష సంస్థగా ఇస్రో ప్రధానంగా కొత్త అంతరిక్ష సాంకేతికతలు, అనువర్తనాల పరిశోధన మరియు అభివృద్ధిపై, బాహ్య అంతరిక్షంపై మానవ అవగాహనను విస్తరించడంపై దృష్టి పెడుతుందని విధానం పేర్కొంది. లక్ష్యాన్ని సాధించడానికి, అంతరిక్ష మౌళిక సదుపాయాలు, అంతరిక్ష రవాణా, అంతరిక్ష అనువర్తనాలు, సామర్థ్యం పెంపుదల మరియు మానవ అంతరిక్షయానం రంగాలలో భారతదేశం సాధించిన ఒరవడిని  కొనసాగించడానికి ఇస్రో అనువర్తిత పరిశోధన మరియు కొత్త వ్యవస్థల అభివృద్ధిని చేపట్టాలని పాలసీ పేర్కొంది.

ఇకపై, పరిణతి చెందిన వ్యవస్థలు వాణిజ్య ప్రయోజనాల కొరకు  పరిశ్రమలకు బదిలీ చేయబడతాయి. ఇస్రో  అధునాతన సాంకేతికతలకు సంబంధించిన పరిశోధన-అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. జాతీయ అవసరాలకు అనుగుణంగా కొత్త వ్యవస్థలను, మరియు అంతరిక్ష వస్తువులను ఆవిష్కరించి సాకారం చేస్తుందని విధానం పేర్కొంది.

ఇండియన్ నేషనల్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce) స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సంస్థగా పని చేస్తుందని, ఇది దేశంలో అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించడం, చేయూతనిచ్చి మార్గనిర్దేశం చేయడం వంటి బాధ్యతలను నిర్వహించే  సాధికారిక సంస్థగా పాలసీ పేర్కొంది

అంతరిక్ష విభాగం కింద ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) ప్రజా ధనంతో రూపొందించబడిన అంతరిక్ష సాంకేతికతలు, రాకెట్లు, ఉపగ్రహ సేవలను వాణిజ్యీకరించడానికి బాధ్యత వహిస్తుందని పాలసీ స్పష్టం చేసింది. ప్రైవేట్ లేదా పబ్లిక్ సెక్టార్ నుండి మంచి వాణిజ్య సూత్రాలపై స్పేస్ కాంపోనెంట్స్, టెక్నాలజీలు, ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఇతర సాధన సంపత్తిని తయారు చేయడం, లీజుకు  లేదా సేకరించడం వంటివి ఎన్‌ఎస్‌ఐఎల్ బాధ్యతలు. వినియోగదారుల యొక్క అంతరిక్ష-ఆధారిత అవసరాలను వాణిజ్య పరంగా ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వేతర సంస్థల  భాగస్వామ్యంతో   తీర్చటంలో ఎన్‌ఎస్‌ఐఎల్ బాధ్యత వహిస్తుంది. విధానంలో వివరించిన బాధ్యతల నిర్వహణను భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం పర్యవేక్షిస్తుంది. మరియు  వారి వారి సంబంధిత విధులను నిర్వర్తించడానికి వివిధ భాగస్వామ్య సంస్థలకు తగిన అధికారం ఉండేలా అంతరిక్ష విభాగం చూస్తుందని.

Wednesday, April 19, 2023

పీఎస్‌ఎల్వీ-సీ55/టెలీయోస్-2 ప్రయోగం ఏప్రిల్ 22న

పీఎస్‌ఎల్వీ-సీ55/టెలీయోస్-2 ప్రయోగం శ్రీహరికోటలోని  సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఏప్రిల్ 22, 2023 14:19 గంటలకు నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి

ప్రయోగంలోసింగపూర్ కు చెందిన 741 కిలోల బరువున్న టెలీయోస్-2 ఉపగ్రహాన్ని మరియు 16 కిలోల బరువున్న లూమెలైట్-4 సూక్ష్మ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్.ఎస్..ఎల్) ద్వారా ఇస్రో నిర్వహిస్తున్న మరొక వాణిజ్య రాకెట్ ప్రయోగమిది. రెండు వాణిజ్య ఉపగ్రహాలతోపాటు, పీఎస్‌ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (పి..,ఎం) కూడా ప్రయోగింపబడుతుంది


ఉపగ్రహాల గురించి ...


టెలీయోస్-2


టెలీయోస్-2 ఉపగ్రహం సింగపూర్ ప్రభుత్వ విభాగం డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (డి.ఎస్.టి.మరియు సింగపూర్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సమిష్ఠి భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ విభాగాల యొక్క ఉపగ్రహ చిత్రాల అవసరాలను టెలీయోస్-2 తీరుస్తుంది. ఉపగ్రహంలో ఒక  సింథటిక్ ఎపర్చరు రాడార్ (SAR) ఉపకరణాన్ని అమర్చారు. అన్ని వాతావరణ స్థితులలో, పగలు, రాత్రి తేడా లేకుండా ఉపగ్రహం సేవలను అందించగలదు. 1 మీటర్ పూర్తి-పోలరిమెట్రిక్ రిజల్యూషన్‌లో చాయ చిత్రాలను ఉపగ్రహం అందిస్తుంది.  


లుమిలైట్-4


లుమిలైట్-4 ఉపగ్రహం, సింగపూర్ కు చెందిన ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్  రిసర్చ్ (*ఎస్.టి..అర్ ) మరియు నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌కి చెందిన శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ సమిష్ఠి భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. హై-పెర్ఫార్మెన్స్ స్పేస్-బోర్న్ వి.హెచ్.ఎఫ్  డేటా ఎక్స్ఛేంజ్ సిస్టమ్ (వి.డి..ఎస్) యొక్క సాంకేతిక ప్రదర్శన కోసం ఉపగ్రహం తయారు  చేయబడిందిసింగపూర్ యొక్క -నావిగేషన్, సముద్ర భద్రతను పెంపొందించడం మరియు ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా ఉపగ్రహం పనిచేస్తుంది.


పీఎస్‌ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (పి.ఒ.ఈ,ఎం)-2

పీఎస్‌ఎల్వీ నాలుగవ దశతో జోడింపబడియుండి, నింగిలో  కొన్ని  శాస్త్రీయ ప్రయోగాలు చేయడానికి పి..,ఎం-2 ఉపయోగబడుతుందిఉపగ్రహాలని నిర్దేశించిన విధంగా కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన తరువాత పీఎస్‌ఎల్వీ నాలుగవ దశ (పి.ఎస్.4) కక్ష్యలో కొంతకాలం పరిభ్రమిస్తుంది. భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో కొన్ని శాస్త్రీయ ప్రయోగాలు చేసేందుకు పి.ఎస్.4ను వేదికగా ఇస్రో ఉపయోగించడం ఇది మూడోసారి. పి...ఎం-2లో ఏడు  ఉపకరణాలను ఏర్పరచారు. వాటిని ఇస్రో, బెల్లాట్రిక్స్, ధృవ స్పేస్ మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌ సంస్థలు రూపొందించాయి



పీఎస్‌ఎల్వీ-సీ55 ప్రత్యేకతలు 


ఇది పీఎస్‌ఎల్వీ యొక్క 57 ప్రయోగం. మరియు స్ట్రాపాన్ బూస్టలు లేని 'కోర్ అలోన్' కాన్ఫిగరేషన్ తో   జరగనున్న పీఎస్‌ఎల్వీ యొక్క 16 ప్రయోగం.

సమాంతర ఇంటిగ్రేషన్ ప్రక్రియ 

మునుపటి ప్రయోగాల మాదిరిగా కాకుండా, పీఎస్‌ఎల్వీ రాకెట్‌లోని వివిధ దశలను అనుసంధానం చేసి ఏకీకృతం చేయడానికి ఉపయోగించిన సమాంతర అనుసంధాన ప్రక్రియ (Parallel integration process) వలన సమయాన్ని గణనీయంగా తగ్గించారు. పీ.ఎస్.ఎల్.వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పి..ఎఫ్) అనే నూతన అనుసంధాన భవనాన్ని నిర్మించి, అక్కడ తొలిసారిగా  పీ.ఎస్.ఎల్.వీ-సి55 యొక్క మొదటి మరియు రెండవ దశలను అనుసంధానం చేశారు


గతంలో, పీ.ఎస్.ఎల్.వీ రాకెట్ల దశలన్నీ మొదటి ప్రయోగ వేదిక (ఫస్ట్ లాంచ్‌ప్యాడ్- ఎఫ్.ఎల్.పి‌) మీదే మొబైల్ సర్వీస్ టవర్ (ఎం.ఎస్.టీ) సహాయంతో అనుసంధానించబడి ఏకీకృతం చేయబడేవి. కాని, ప్రయోగంలో పి..ఎఫ్ భవనంలో తొలి రెండు దశలు, మొబైల్ లాంచ్ పీడెస్టల్ (ఎం.ఎల్.పి) పై ఏకీకృతం చేయబడ్డాయి. పి..ఎఫ్లో తొలి రెండు దశలు అనుసంధానింపబడే సమయంలో, మొదటి ప్రయోగ వేదికపై ఇతర సాంకేతిక కార్యక్రమాలను నిర్వహించుకునే వీలు కలుగుతుంది. ఎం.ఎల్.పి పై అనుసంధానించబడిన రెండు దశలను, పి..ఎఫ్ నుండి రైల్ పట్టాలపై మొదటి ప్రయోగ వేదికకు చేర్చారు. తరువాత, రెండవ దశపై, మూడు-నాలుగు దశల మాడ్యూలును అమర్చి, చివరగా, ఎక్విప్మెట్ బే పై ఉపగ్రహాలను అమర్చి, హీట్ షీల్డులను బిగించారు

 

ప్రక్రియ వలన సమయం గణనీయంగా ఆదా అయింది, అంటే, ఇక మీద, తక్కువ వ్యవధిలో పీ.ఎస్.ఎల్.వీ రాకెట్ల దశలను అనుసంధానం చేసేందుకు ఇస్రో కు వీలు కలుగుతుంది. తద్వారా, సంవత్సరంలో ప్రయోగించే పీ.ఎస్.ఎల్.వీ రాకెట్ల ప్రయోగాల సంఖ్య పెరగుతుంది.