Friday, April 14, 2023

పీ.ఎస్.ఎల్.వీ వివిధ దశల అనుసంధానానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి సమాంతర ఇంటిగ్రేషన్ ప్రక్రియను ఉపయోగిస్తున్న ఇస్రో

సాధారణంగా, మొదటి ప్రయోగ వేదిక (ఫస్ట్ లాంచ్‌ప్యాడ్) మీదే మొబైల్ సర్వీస్ టవర్ సహాయంతో పి.ఎస్.ఎల్.వి/జి.ఎస్.ఎల్.వి రాకెట్‌ను అనుసంధానం చేస్తారు. ప్రక్రియ పూర్తయ్యే వరకూ ప్రయోగ వేదికపై వేరే పనులు చేసే అవకాశం ఉండదు. ఇలా ప్రయోగ వేదిక చాలా కాలం పాటు ఆక్రమించబడి, కేవలం రాకెట్ల అనుసంధానం మాత్రమే చేయగలిగినప్పుడు, ప్రయోగాలు తక్కువ సంఖ్యలో నిర్వహించబడతాయి.ఇస్రో యొక్క సరికొత్త రాకెట్ ఎస్.ఎస్.ఎల్.వి (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్శీఘ్ర అనుసంధానం మరియు ఏకీకృతం కోసం రూపొందించబడిందిఇది ఒక వారంలోపు చేయబడుతుంది.  అయితేపి.ఎస్.ఎల్.వి మరియు జి.ఎస్.ఎల్.వి  వంటి పెద్ద రాకెట్ల అనుసంధానం మరియు ఏకీకృతం  ప్రక్రియకు 30 నుండి 60 రోజుల వరకు పట్టవచ్చు.

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీ.ఎస్.ఎల్.వీ)-సి55కు సంబంధించిన వివిధ దశల అనుసంధానానికి పట్టే సమయాన్ని తగ్గించడానికిసమాంతర ఇంటిగ్రేషన్ ప్రక్రియను ఇస్రో  ఉపయోగిస్తుందిమునుపటి ప్రయోగాల మాదిరిగా కాకుండా, రాకెట్‌లోని వివిధ దశలను అనుసంధానం చేసి ఏకీకృతం చేయడానికి ఉపయోగించిన సమాంతర ఇంటిగ్రేషన్ ప్రక్రియ వలన సమయాన్ని గణనీయంగా తగ్గించారు. పీ.ఎస్.ఎల్.వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పి..ఎఫ్) అనే నూతన అనుసంధాన భవనాన్ని నిర్మించి, అక్కడ తొలిసారిగా  పీ.ఎస్.ఎల్.వీ-సి55 యొక్క మొదటి  మరియు రెండవ దశలను అనుసంధానం చేశారు

పి..ఎఫ్లో తొలి రెండు దశలు అనుసంధానింపబడే సమయంలో, మొదటి ప్రయోగ వేదికపై ఇతర సాంకేతిక కార్యక్రమాలను నిర్వహించుకునే వీలు కలుగుతుంది. ఎం.ఎల్.పి పై అనుసంధానించబడిన రెండు దశలను, పి..ఎఫ్ నుండి రైల్ పట్టాలపై మొదటి ప్రయోగ వేదికకు చేరుస్తారు. తరువాత, రెండవ దశపై, మూడు-నాలుగు దశల మాడ్యూలును  అమరుస్తారు. చివరగా, ఎక్విప్మెట్ బే పై ఉపగ్రహాన్ని అమర్చి, హీట్ షీల్డులను బిగిస్తారు




ప్రక్రియ వలన సమయం గణనీయంగా ఆదా అవుతుంది, తద్వారా, సంవత్సరంలో ప్రయోగించే పీ.ఎస్.ఎల్.వీ రాకెట్ల ప్రయోగాల సంఖ్య పెరగుతుంది. అంటే, తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోగాలను చేసేందుకు ఇస్రో కు వీలు కలుగుతుందితద్వారా ప్రభుత్వానికి చేకూరే  ఆదాయం కుడా ఎక్కువగా ఉంటుంది



మూడవ తరం రాకెట్ గా పిలువబడుతున్న పీ.ఎస్.ఎల్.వీ రాకెట్, అత్యధిక ప్రయోగ విజయాలతో, ఇస్రో కు నమ్మిన బంటుగా మారిందిఇది ఇప్పటివరకు 33 దేశాలకు సంబంధించి దాదాపు 297 కస్టమర్ ఉపగ్రహాలను  భూ సమీప కక్ష్య (లో ఎర్త్ ఆర్బిట్- ఎల్..) లోకి ప్రయోగించింది.


No comments: