2023, ఏప్రిల్ 6న ప్రభుత్వం ప్రకటించబడిన కొత్త భారత అంతరిక్ష విధానం ప్రకారం, ఇకపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో, అంతరిక్ష వ్యవస్థల తయారీ మరియూ కార్యాచరణ భాద్యతల నుండి వైదొలగి, అధునాతన సాంకేతికతలలో పరిశోధన మరియు అభివృద్ధిపై తన శక్తులను కేంద్రీకరిస్తుంది. భద్రతకు సంబంధించిన కేంద కేబినెట్ కమిటీ ఆమోదించిన 'ఇండియన్ స్పేస్ పాలసీ-2023' ప్రకారం, భూస్థిర కక్ష్య ద్వారా జాతీయ మరియు అంతర్జాతీయ అంతరిక్ష-ఆధారిత కమ్యూనికేషన్ సేవలను, మరియూ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించే భూసమీప (low earth orbit) మరియూ మధ్యస్థ భూకక్ష్యల్లోని (medium earth orbit) ఉపగ్రహ అధారిత సేవలను అందించడానికి ప్రభుత్వేతర సంస్థలను (Non Government Entities-NGEs) కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. స్వీయ-యాజమాన్యం, సేకరించిన లేదా లీజుకు తీసుకుని ఈ సేవలను అందించవచ్చు. టెలిమెట్రీ, ట్రాకింగ్ మరియు కమాండ్ (TT&C) ఎర్త్ స్టేషన్‌లు మరియు ఉపగ్రహ నియంత్రణ కేంద్రాలు (Satellite Control Centres) వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి మరియు నిర్వహించడానికి ప్రభుత్వేతర సంస్థలను ఈ విధానం ప్రోత్సహిస్తుంది. ఉపగ్రహ ప్రయోగ రాకెట్లు అలాగే అంతరిక్ష రవాణా కోసం పునర్వినియోగ/పునరుద్ధరించబడిన/ పునర్నిర్మించబడిన సాంకేతికతలు మరియు వ్యవస్థల రూపకల్పన మరియు అభివృద్ధితో సహా అంతరిక్ష రవాణా వ్యవస్థలను తయారు చేయడానికి మరియు నిర్వహించడానికి ఈ విధానం ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహిస్తుంది.
కొత్త అంతరిక్ష విధానాన్ని స్వాగతించిన పారిశ్రామిక రంగం
కొత్త అంతరిక్ష విధానాన్ని భారత పారిశ్రామిక రంగం స్వాగతించింది. "ఈ విధానం అన్ని అంతరిక్ష కార్యకలాపాలపై, ప్రత్యేకించి స్పేస్ కమ్యూనికేషన్ మరియు ఇతర అనువర్తనాలకు సంబంధించి స్పష్టతను అందిస్తుంది" అని ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఏ.కే. భట్ అన్నారు. భారతదేశంలో బలమైన వినూత్న మరియు ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి ఈ విధానం ఉత్ప్రేరకంగా ఉంటుందని ఆయన అన్నారు.
కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, డేటా సర్వీసెస్ మరియు లాంచ్ సర్వీసెస్ వంటి అంతరిక్ష సాంకేతికత లేదా సేవలను, పబ్లిక్ లేదా ప్రైవేట్ సెక్టార్ నుండి, భారతీయ వినియోగదారులు నేరుగా, ఎటువంటి అవరోధాలు లేకుండా పొందవచ్చని కూడా పాలసీ పేర్కొంది.
2020లో ఆవిష్కరించిన అంతరిక్ష రంగ సంస్కరణల ద్వారా ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యానికి మార్గం సుగమం చేసింది. ఆ సంస్కరణను అమలు చేయడానికి విస్తృతమైన విధి, విధానాలతో ఈ కొత్త అంతరిక్ష విధానం రూపొందించబడింది.
జాతీయ అంతరిక్ష సంస్థగా ఇస్రో ప్రధానంగా కొత్త అంతరిక్ష సాంకేతికతలు, అనువర్తనాల పరిశోధన మరియు అభివృద్ధిపై, బాహ్య అంతరిక్షంపై మానవ అవగాహనను విస్తరించడంపై దృష్టి పెడుతుందని ఈ విధానం పేర్కొంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, అంతరిక్ష మౌళిక సదుపాయాలు, అంతరిక్ష రవాణా, అంతరిక్ష అనువర్తనాలు, సామర్థ్యం పెంపుదల మరియు మానవ అంతరిక్షయానం రంగాలలో భారతదేశం సాధించిన ఒరవడిని కొనసాగించడానికి ఇస్రో అనువర్తిత పరిశోధన మరియు కొత్త వ్యవస్థల అభివృద్ధిని చేపట్టాలని పాలసీ పేర్కొంది.
ఇకపై, పరిణతి చెందిన వ్యవస్థలు వాణిజ్య ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు బదిలీ చేయబడతాయి. ఇస్రో అధునాతన సాంకేతికతలకు సంబంధించిన పరిశోధన-అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. జాతీయ అవసరాలకు అనుగుణంగా కొత్త వ్యవస్థలను, మరియు అంతరిక్ష వస్తువులను ఆవిష్కరించి సాకారం చేస్తుందని విధానం పేర్కొంది.
ఇండియన్ నేషనల్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce) స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సంస్థగా పని చేస్తుందని, ఇది దేశంలో అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించడం, చేయూతనిచ్చి మార్గనిర్దేశం చేయడం వంటి బాధ్యతలను నిర్వహించే సాధికారిక సంస్థగా పాలసీ పేర్కొంది.
అంతరిక్ష విభాగం కింద ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) ప్రజా ధనంతో రూపొందించబడిన అంతరిక్ష సాంకేతికతలు, రాకెట్లు, ఉపగ్రహ సేవలను వాణిజ్యీకరించడానికి బాధ్యత వహిస్తుందని పాలసీ స్పష్టం చేసింది. ప్రైవేట్ లేదా పబ్లిక్ సెక్టార్ నుండి మంచి వాణిజ్య సూత్రాలపై స్పేస్ కాంపోనెంట్స్, టెక్నాలజీలు, ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఇతర సాధన సంపత్తిని తయారు చేయడం, లీజుకు లేదా సేకరించడం వంటివి ఎన్‌ఎస్‌ఐఎల్ బాధ్యతలు. వినియోగదారుల యొక్క అంతరిక్ష-ఆధారిత అవసరాలను వాణిజ్య పరంగా ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యంతో తీర్చటంలో ఎన్‌ఎస్‌ఐఎల్ బాధ్యత వహిస్తుంది. ఈ విధానంలో వివరించిన బాధ్యతల నిర్వహణను భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం పర్యవేక్షిస్తుంది. మరియు వారి వారి సంబంధిత విధులను నిర్వర్తించడానికి వివిధ భాగస్వామ్య సంస్థలకు తగిన అధికారం ఉండేలా అంతరిక్ష విభాగం చూస్తుందని.
No comments:
Post a Comment