Friday, April 14, 2023

పీ.ఎస్.ఎల్.వీ వివిధ దశల అనుసంధానానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి సమాంతర ఇంటిగ్రేషన్ ప్రక్రియను ఉపయోగిస్తున్న ఇస్రో

సాధారణంగా, మొదటి ప్రయోగ వేదిక (ఫస్ట్ లాంచ్‌ప్యాడ్) మీదే మొబైల్ సర్వీస్ టవర్ సహాయంతో పి.ఎస్.ఎల్.వి/జి.ఎస్.ఎల్.వి రాకెట్‌ను అనుసంధానం చేస్తారు. ప్రక్రియ పూర్తయ్యే వరకూ ప్రయోగ వేదికపై వేరే పనులు చేసే అవకాశం ఉండదు. ఇలా ప్రయోగ వేదిక చాలా కాలం పాటు ఆక్రమించబడి, కేవలం రాకెట్ల అనుసంధానం మాత్రమే చేయగలిగినప్పుడు, ప్రయోగాలు తక్కువ సంఖ్యలో నిర్వహించబడతాయి.ఇస్రో యొక్క సరికొత్త రాకెట్ ఎస్.ఎస్.ఎల్.వి (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్శీఘ్ర అనుసంధానం మరియు ఏకీకృతం కోసం రూపొందించబడిందిఇది ఒక వారంలోపు చేయబడుతుంది.  అయితేపి.ఎస్.ఎల్.వి మరియు జి.ఎస్.ఎల్.వి  వంటి పెద్ద రాకెట్ల అనుసంధానం మరియు ఏకీకృతం  ప్రక్రియకు 30 నుండి 60 రోజుల వరకు పట్టవచ్చు.

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీ.ఎస్.ఎల్.వీ)-సి55కు సంబంధించిన వివిధ దశల అనుసంధానానికి పట్టే సమయాన్ని తగ్గించడానికిసమాంతర ఇంటిగ్రేషన్ ప్రక్రియను ఇస్రో  ఉపయోగిస్తుందిమునుపటి ప్రయోగాల మాదిరిగా కాకుండా, రాకెట్‌లోని వివిధ దశలను అనుసంధానం చేసి ఏకీకృతం చేయడానికి ఉపయోగించిన సమాంతర ఇంటిగ్రేషన్ ప్రక్రియ వలన సమయాన్ని గణనీయంగా తగ్గించారు. పీ.ఎస్.ఎల్.వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పి..ఎఫ్) అనే నూతన అనుసంధాన భవనాన్ని నిర్మించి, అక్కడ తొలిసారిగా  పీ.ఎస్.ఎల్.వీ-సి55 యొక్క మొదటి  మరియు రెండవ దశలను అనుసంధానం చేశారు

పి..ఎఫ్లో తొలి రెండు దశలు అనుసంధానింపబడే సమయంలో, మొదటి ప్రయోగ వేదికపై ఇతర సాంకేతిక కార్యక్రమాలను నిర్వహించుకునే వీలు కలుగుతుంది. ఎం.ఎల్.పి పై అనుసంధానించబడిన రెండు దశలను, పి..ఎఫ్ నుండి రైల్ పట్టాలపై మొదటి ప్రయోగ వేదికకు చేరుస్తారు. తరువాత, రెండవ దశపై, మూడు-నాలుగు దశల మాడ్యూలును  అమరుస్తారు. చివరగా, ఎక్విప్మెట్ బే పై ఉపగ్రహాన్ని అమర్చి, హీట్ షీల్డులను బిగిస్తారు




ప్రక్రియ వలన సమయం గణనీయంగా ఆదా అవుతుంది, తద్వారా, సంవత్సరంలో ప్రయోగించే పీ.ఎస్.ఎల్.వీ రాకెట్ల ప్రయోగాల సంఖ్య పెరగుతుంది. అంటే, తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోగాలను చేసేందుకు ఇస్రో కు వీలు కలుగుతుందితద్వారా ప్రభుత్వానికి చేకూరే  ఆదాయం కుడా ఎక్కువగా ఉంటుంది



మూడవ తరం రాకెట్ గా పిలువబడుతున్న పీ.ఎస్.ఎల్.వీ రాకెట్, అత్యధిక ప్రయోగ విజయాలతో, ఇస్రో కు నమ్మిన బంటుగా మారిందిఇది ఇప్పటివరకు 33 దేశాలకు సంబంధించి దాదాపు 297 కస్టమర్ ఉపగ్రహాలను  భూ సమీప కక్ష్య (లో ఎర్త్ ఆర్బిట్- ఎల్..) లోకి ప్రయోగించింది.


Friday, March 31, 2023

వృద్ధిచెందుతున్న ఇస్రో వాణిజ్య అవకాశాలకు 'ఒన్‌వెబ్' ఉపగ్రహల ప్రయోగం ఒక యోగ్యతా పత్రము

భారత ఉపగ్రహ వాహక రాకెట్ట్ 'ఎల్.వి.ఎం-3'  మార్చి 26, 36 ఒన్‌వెబ్ ఉపగ్రహాలను జయప్రదంగా కక్ష్యలోకి  ప్రయోగించిన  విషయం తెలిసినదే కదా ప్రయోగం, ఉపగ్రహాలను నిర్మించిన యూ.కే సంస్థ ఒన్‌వెబ్ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ - ఇస్రో) చేసిన  రెండవ వాణిజ్య ప్రయోగం.

ఇస్రో రాకెట్ల సముదాయంలో అన్నిటికన్నా ఎల్.వి.ఎం-3 శక్తివంతమైనది. గతంలో పీ,ఎస్.ఎల్వీ  (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) రాకెట్లు వందలాది ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించి, అంతరిక్ష విపణిలో మంచి గుర్తింపు పొందినా, ఎల్.వి.ఎం-3 రాకెట్ అందుబాటు లోకి వచ్చిన తరువాత, వాణిజ్యపరంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే సత్తా ఉన్న ఇతర దేశాలకు, తక్కువ రుసుము తీసుకుంటూ భారత్  గట్టి పోటీని ఇస్తూ, కొత్త అవకాశాలను అందుకుంటున్నది.

ఒన్‌వెబ్ కాంట్రాక్టులను ఇస్రో ఎలా గెలుచుకుంది?

ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం నేపథ్యంలో, గత  సంవత్సర కాలంగా, యూరోపియన్ దేశాలకు వాణిజ్య అంతరిక్ష సేవలను రష్యా నిలిపివేసిందితదనుగుణంగా, ఒన్‌వెబ్  సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని  రోస్కోస్మోస్ సంస్థ రద్దు చేసుకున్నది.  2022 వరకూ రోస్కోస్మోస్ సంస్థ, సోయుజ్ రాకెట్ల ద్వారా,  428 ఒన్‌వెబ్  ఉపగ్రహాలను ప్రయోగించిందిఅయితేఒన్‌వెబ్ యొక్క అత్యవసరాన్ని తీర్చడానికి  భారతదేశం సంసిద్ధత తెలిపిందిఒన్‌వెబ్ - భారత అంతరిక్ష సంస్థ యొక్క వాణిజ్య విభాగం - న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్.ఎస్..ఎల్) మధ్య జరిగిన  ఒప్పందం ప్రకారం, ఇస్రో ఇప్పటి వరకూ 72 ఉపగ్రహాలను, రెండు విడతలుగా కక్ష్యలోకి ప్రయోగించింది

ప్రతి ప్రయోగానికి ప్రయోగ రుసుము  $60 మిలియన్లు . కాంట్రాక్ట్ కొరకు పోటీ పడ్డ ఫాల్కన్- 9  ప్రయోగ రుసుము కన్నా,   ఎన్.ఎస్..ఎల్ ధర $7 మిలియన్లు తక్కువ.

భారతదేశ అంతరిక్ష రంగం యొక్క  వాణిజ్య భవిష్యత్తు

వార్షిక ప్రయోగాల సంఖ్య తక్కువగా ఉండటమే భారత అంతరిక్ష రంగం యొక్క  వాణిజ్య విజయానికి అతిపెద్ద ప్రతిబంధకమని, రంగలోని నిపుణులు చెబుతున్నారుప్రస్తుతం, ఒక  ఎల్.వి.ఎం-3 రాకెట్ ను తయారుచేయడానికి  ఆరు నుండి ఎనిమిది నెలల సమయం పడుతుంది.  2025 నాటికి వ్యవధిని సగానికి తగ్గించాలని ఎన్.ఎస్..ఎల్ మరియు ఇస్రో భావిస్తున్నాయి.


ఎల్.వి.ఎం-3ని ఆరుసార్లు విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది. భారతీయ రాకెట్‌లో మోసుకెళ్లిన వాటిలో అత్యంత బరువైనవి, ఒక్కొక్కటి 6,000 కిలోల బరువున్న రెండు ఒన్‌వెబ్ ఉపగ్రహ సమూహాలుఇంకా  అధిక బరువైన ఉపగ్రహాలను తీసుకెళ్ళే విధంగా ఎల్.వి.ఎం-3 యొక్క  సామర్థ్యాన్ని పెంచే పనిలో ఇస్రో ఉంది, 1999లో తన మొదటి వాణిజ్య ప్రయోగం నుండి 36 దేశాలకు చెందిన  348 ఉపగ్రహాలను పీ,ఎస్.ఎల్వీ ప్రయోగించింది. పెరుగుతున్న ప్రపంచ ప్రయోగ పోటీకి దీటుగా, పూర్తిగా పరిశ్రమ-నిర్మిత పీ,ఎస్.ఎల్వీ లను నిర్మించేందుకు  ప్రధాన పి.ఎస్.ఎల్వీ కాంట్రాక్టర్ల కన్సార్టియంతోఎన్.ఎస్..ఎల్ గత సెప్టెంబర్‌లో $104 మిలియన్ల ఒప్పందాన్ని ఖరారు చేసిందితద్వారా ఉత్పత్తి రేట్లు పెరిగి, ప్రయోగ ధరలను తగ్గించటమే లక్ష్యం.


దీనితోబాటు, ఇస్రో యొక్క కొత్త మాడ్యులర్ ఎస్.ఎస్.ఎల్.వీ (చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం) రాకెట్, 2026 నాటికి సంవత్సరానికి 10 ప్రయోగాల వరకు చేయాలనే లక్ష్యంతో తక్కువ ప్రయోగ ధరతో  మార్కెట్‌లోకి ప్రవేశించడానికి అవసరమైన ప్రణాళికలతో  ఎన్.ఎస్..ఎల్ సిద్ధంగా ఉంది. ఎల్.వి.ఎం-3, పీ,ఎస్.ఎల్వీ మరియు ఎస్.ఎస్.ఎల్.వీ లతో  వాణిజ్యపరంగా ఉపగ్రహాలను ప్రయోగించటలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడనున్నది.


గగన్‌యాన్ ప్రోగ్రామ్ లో భాగంగా,   దశాబ్దం మధ్య నాటికి వ్యోమగాములు  సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా  ఎల్.వి.ఎం-౩కు  వివిధ మార్పులను ఇస్రో చేస్తోంది, అలా ఎల్.వి.ఎం- రాకెట్‌ను 'మ్యాన్ రేటింగ్' చేయడంతో, అది మరింత నమ్మదగినదిగా అవుతుంది. మార్చి 26 జరిగిన వన్‌వెబ్ ప్రయోగానికి ఉపయోగించిన ఎల్.వి.ఎం-, పెరిగిన మార్జిన్‌లు మరియు అధిక విశ్వసనీయతతో అప్‌గ్రేడ్ చేసిన ఘన రాకెట్ బూస్టర్‌లను వినియోగించిందని ఇస్రో అద్యక్షులు ఎస్. సోమనాథ్ పోస్ట్-లాంచ్ బ్రీఫింగ్‌లో తెలిపారుభవిష్యత్తులో గగన్‌యాన్ ప్రయోగాల కోసం బూస్టర్‌లు పరీక్షించబడుతున్నాయి.