Sunday, February 19, 2023

చంద్రయాన్-3 ల్యాండర్ పై కీలక పరీక్ష విజయవంతం

ఫిబ్రవరి 19, 2023 - భెంగుళూరులోని డా. యూ.ఆర్. రావు ఉపగ్రహ కేంద్రంలో చంద్రయాన్-3 ల్యాండర్ కు సంబంధించిన విద్యుదయస్కాంత జోక్యం/ విద్యుదయస్కాంత అనుకూలత  (EMI-EMC - ఎలక్ట్రో - మాగ్నెటిక్ ఇంటర్‌ఫెరెన్స్/ ఎలక్ట్రో - మాగ్నెటిక్ కాంపాటిబిలిటీ) పరీక్షను విజయవంతంగా ఇస్రో పూర్తి చేసింది.    జనవరి 31 - ఫిబ్రవరి 2 మధ్యలో   జరిపిన   పరీక్ష విజయవంతగా  నిర్వహించబడిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం తెలిపింది.

అంతరిక్ష వాతావరణంలో ఉపగ్రహ ఉపవ్యవస్థల కార్యాచరణను మరియు ఆశించిన విద్యుదయస్కాంత స్థాయిలతో వాటి అనుకూలతను నిర్ధారించడానికి పరీక్ష నిర్వహించబడుతుంది. " పరీక్ష చంద్రయాన్-3 ఉపగ్రహా అభివృద్ధి క్రమంలో ఒక ప్రధాన మైలురాయి" అని అంతరిక్ష సంస్థ తెలిపింది.


చంద్రయాన్-3 ఇంటర్‌ప్లానెటరీ మిషన్‌లో మూడు ప్రధాన విభాగాలు (మాడ్యూల్స్) ఉన్నాయి: ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్ మరియు రోవర్ మాడ్యూల్స్ మధ్య రేడియో-ఫ్రీక్వెన్సీ (RF) కమ్యూనికేషన్ లింక్‌లను ఏర్పాటు చేయడమే ప్రయోగంలో ప్రధాన సంక్లిష్టత.


ల్యాండర్ పై నిర్వహించిన EMI/EC పరీక్షలో భాగంగా, ఉపగ్రహ వాహక రాకెట్ తో  అనుకూలత (compatibility), అన్ని RF సిస్టమ్‌ల యాంటెన్నా పోలరైజేషన్, కక్ష్య మరియు పవర్డ్ డిసెంట్ మిషన్ దశల కోసం స్వతంత్ర ఆటో అనుకూలత (Standalone auto compatibility) పరీక్షలు మరియు చంద్రుని  ఉపరితలంపై  దిగిన  తరువాత  (పోస్ట్ ల్యాండింగ్ మిషన్ దశ) కోసం ల్యాండర్ & రోవర్ అనుకూలత పరీక్షలు నిర్ధారించబడ్డాయి. వ్యవస్థల పనితీరు సంతృప్తికరంగా ఉంది' అని ఇస్రో తెలిపింది.


చంద్రయాన్-3 అనేది చంద్ర గ్రహానికి సంబంధించిన ఇస్రో నిర్వహించే మూడవ ప్రయోగం. చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా దిగటం మరియు అక్కడ సంచరించటంలో (రోవింగ్‌) పరిపూర్ణ సామర్థ్యాన్ని ప్రదర్శించడమే  యాత్ర ప్రధాన  లక్ష్యంచంద్రయాన్-2కి  కొనసాగింపుగా ప్రయోగం నిర్వహింపబడుతుంది. ఏడాది చివర్లో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఎల్.వీ,ఎం-3 ద్వారా ప్రయోగం జరుగుతుంది.


ఎనిఖాయిక్ ఛాంబర్లో చంద్రయాన్-3 ల్యాండర్ పై విద్యుదయస్కాంత జోక్యం/ విద్యుదయస్కాంత అనుకూలత కు సంబంధించిన పరిక్ష దృశ్యం  







No comments: