Sunday, February 19, 2023

ఒన్ వెబ్ సంస్థకు చెందిన 36 ఇంటర్నెట్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ఎల్వీఎం-3 ఉపగ్రహ వాహక రాకెట్ ని సిద్ధం చేస్తున్న ఇస్రో

యునైటెడ్ కింగ్డంకు చెందిన  నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ లిమిటెడ్ (ఒన్ వెబ్) సంస్థకు చెందిన, రెండవ విడత  36 ఇంటర్నెట్ శాటిలైట్ ఉపగ్రహాల సమూహాన్ని (కన్స్ఠలేషన్అంతరిక్షంలోకి మోహరించేందుకై  తన భారీ ప్రయోగ వాహనాన్ని  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ - ఇస్రో) సిద్ధం చేస్తోంది ప్రయోగం  మార్చి మధ్యలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జరపటానికి ముమ్మరంగా పనులు  జరుగుతున్నాయి. గత సంవత్సరం అక్టోబర్ 23  ఒన్ వెబ్ సంస్థకు చెందిన  36 ఉపగ్రహాలను మొదటి విడతగా ఎల్వీఎం-3 ద్వారా వాణిజ్య పరంగా ఇస్రో ప్రయోగించింది.  

ఉక్రెయిన్‌ యుద్ధ నేపధ్యంలో పాశ్చాత్య దేశాల నుండి ఆంక్షలనెదుర్కుంటున్న  రష్యా యునైటెడ్ కింగ్‌డమ్‌కు రాకెట్ ప్రయోగ సేవలను నిరాకరించింది.  తర్వాత ఒన్ వెబ్ సంస్థ,  ఇస్రో వాణిజ్య విభాగం - ‘న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌’ (ఎన్.ఎస్..ఎల్ ) తో కుదుర్చుకున్న  ఒప్పందం ప్రకారం 72 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి   ఇస్రో రెండు విడతలుగా పంపటానికి అంగీకారం కుదిరిందిదానికిగాను ఒన్ వెబ్ సంస్థ సుమారు రూ. 1000 కోట్లు చెల్లిస్తుంది.  ప్రపంచవ్యాప్తంగా ఒన్ వెబ్ సంస్థ ఇంటర్నెట్ సేవలను అందించడానికి 648 ఉపగ్రహాలను  భూ సమీప కక్ష్యలోకి (Low Earth Orbit - LEO) ప్రవేశపెట్టాలనుకుంటోందిదానిలో  భాగంగా ఒన్ వెబ్ ఇటీవలే ఫ్లోరిడాలోని స్పేస్‌ఎక్స్ యొక్క ప్రయోగ కేంద్రం నుండి  ఫాల్కన్ 9 రాకెట్‌లో తన 16 ప్రయోగాన్ని పూర్తి చేసింది.  ఇప్పటి వరకూ మొత్తం  542 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి.











 <    ఎల్.వీ.ఎం-3  రాకెట్ పేలోడ్ ఫెయిరింగ్ లోపల ఒన్ వెబ్ యొక్క  36 ఇంటర్నెట్ ఉపగ్రహాల అమరిక







No comments: