Saturday, November 12, 2022

భారత దేశంలో మరొక ప్రైవేట్ రాకెట్ 'అగ్నిబాణ్'

అగ్నికుల్ కాస్మోస్ తన రెండు దశల రాకెట్ అగ్నిబాణ్ యొక్క ప్రయోగం డిసెంబర్‌ 2022లో చేయబోతున్నది.   టెస్ట్ లాంచ్ యొక్క ఫలితాల ఆధారంగా,  మార్చి లేదా ఏప్రిల్ 2023 లో కస్టమర్ పేలోడ్‌లతో వాణిజ్య ప్రయోగాన్ని ఎస్‌డిఎస్‌సి షార్శ్రీహరికోట నుండి నిర్వహించాలని యోచిస్తున్నట్లు అగ్నికుల్ కాస్మోస్ సంస్థ యొక్క సహ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ శ్రీనాథ్ రవిచంద్రన్ తెలిపారు

చెన్నైకి చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ అయిన అగ్నికుల్ కాస్మోస్ వారి రాకెట్ అగ్నిబాణ్ను పూర్తి స్థాయి వాణిజ్య ప్రయోగాలకు గాను రూపొందిస్తున్నట్లు శ్రీనాథ్ రవిచంద్రన్ తెలిపారు. స్టార్టప్ యొక్క సింగిల్-పీస్ 3 డి-ప్రింటెడ్ ఇంజిన్ అయిన అగ్నిలెట్ పై స్థిర పరీక్ష ఇటీవల తిరువనంతపురంలోని భారత అంతరిక్ష పరిశోధనా  సంస్థ  (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ - ఇస్రో) యొక్క ప్రధాన కేంద్రం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్ఎస్సి) లో జయప్రదంగా జరిగింది.  


ఆపరేషన్స్ స్పెషలిస్ట్ రవిచంద్రన్ 2017 లో ఐఐటి మద్రాస్-ఇంక్యుబేటెడ్ స్టార్టప్‌ను స్థాపించారు. ఇది గత ఏడాది సిరీస్ రౌండ్‌లో 11 మిలియన్ డాలర్లతో సహా, వెంచర్ క్యాపిటల్ సంస్థ మేఫీల్డ్ ఇండియా మరియు ఏంజెల్ ఇన్వెస్టర్లు ఆనంద్ మహీంద్రా మరియు నితిన్ కామత్ వంటి పెట్టుబడిదారుల మద్దతుతో సహా  $15 మిలియన్లను సేకరించింది


డిసెంబర్ లో జరిగే టెస్ట్ లాంచ్ వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను ధృవీకరించడంలో సహాయపడుతుంది. "డైనమిక్స్, ఏవియానిక్స్, నావిగేషన్ వంటి పలు సాంకేతిక వ్యవస్థల పని తీరును  ధృవీకరించే విధంగా మేము మా పరీక్ష ప్రయోగాన్ని నిర్వహిస్తాము. అది ఎలా జరుగుతుందో మేము చూస్తాము" అని శ్రీనాథ్ రవిచంద్రన్ అన్నారు. టెస్ట్ లాంచ్ ఫలితాల ఆధారంగా, అగ్నికుల్ కాస్మోస్ పూర్తి స్థాయి వాణిజ్య ప్రయోగానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు


స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ విక్రమ్-ఎస్ తో పోలిస్తే అగ్నిబాణ్ విభిన్నం 


నవంబర్ 12 మరియు 16 మధ్య హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయోగించే  విక్రమ్-ఎస్ దేశంలో  మొదటి ప్రైవేటుగా రంగ రాకెట్ అవుతుంది. అయితే, అగ్నికుల్ కాస్మోస్ యొక్క ప్రయోగం విక్రమ్-ఎస్ ప్రయోగంతో పోలిస్తే, చాలా భిన్నంగా ఉంటుందని శ్రీనాథ్ రవిచంద్రన్ అన్నారు. ఘన ఇంధనాన్ని ఉపయోగించే విక్రమ్-ఎస్ ఇంజిన్ మాదిరిగా కాకుండా, అగ్నికుల్ కాస్మోస్ యొక్క ఇంజన్లు సెమీ క్రియోజెనిక్ మరియు ద్రవ ఇంధనాలను ఉపయోగించుకుంటాయి


రెండు స్టార్టప్‌ కంపెనీల మధ్య వ్యత్యాసం వాణిజ్య పరంగా వారు అందించే సేవలలో కూడా ఉంది. స్కైరూట్ ఏరోస్పేస్ అధిక బరువున్న ఉపగ్రహలను ప్రయోగించ గలదు. కాని మేము చిన్న ఉపగ్రహాలను  ప్రయోగించే లక్ష్యంతొ పనిచేస్తున్నామని ఆయన అన్నారు


భారత ప్రభుత్వం 2020 లో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) ను అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలో సింగిల్-విండో అటానమస్ ఏజెన్సీగా స్థాపించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ అంతరిక్ష సంస్థల మధ్య కమ్యూనికేషన్, ఇంటిగ్రేషన్ మరియు అనుమతి-సంబంధిత సంక్లిష్టతలను తగ్గించడానికి రెగ్యులేటర్ కేంద్ర బిందువుగా ఇన్-స్పేస్ ఉద్భవించింది. తదనుగుణంగానే  అగ్నికుల్ కాస్మోస్ ఇంజిన్ పరీక్ష విఎస్ఎస్సి లో నిర్వహించబడింది



అగ్నికుల్ తో పరస్పర చర్చల తరువాత ఇస్రో నవంబర్ 11, 2022 అగ్నిబాణ్ కోసం మొదటి ఫ్లైట్ టెర్మినేషన్ సిస్టమ్ (ఎఫ్‌టిఎస్) ను, సంబంధిత ఇతర  వ్యవస్థలను అందించిందిఒక  ప్రైవేట్ రాకెట్ కు ఇస్రో రూపొందించిన వ్యవస్థను సరఫరా చేయడం ఇదే మొదటిసారి. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ లో శ్రీహరికోట నుండి ప్రయోగించబోయే అగ్నిబాణ్ రాకెట్లో వ్యవస్థలను ఉపయోగిస్తారు.

 


18 మీ. ఎత్తు, 1.3 మీ. వ్యాసం, 14000 కిలోల బరువు ఉన్న అగ్నిబాణ్ రెండు దశల ఉపగ్రహ వాహక రాకెట్. ఒకటి లేదా అనేక ఉపగ్రహాలను అమర్చటానికి వీలుగలిగించే 2 మీ x 1.5 మీ. చోటు (ఎన్వలప్‌) ఫెయిరింగ్ లో ఉంటుంది. అందులో ఒక ఐచ్ఛిక బేబీ స్టేజ్ ని అమరుస్తారు. 700 కి.మీ ఎత్తులో ఉన్న కక్ష్యలకు మొత్తం 100 కిలోల పేలోడ్లను ప్రయోగించే సామర్థ్యం అగ్నిబాణ్  కు ఉన్నదితక్కువ ఎత్తు మరియు అధిక వంపు (లో ఇంక్లినేషన్) ఉన్న కక్ష్యలకు కూడా  పేలోడ్లను ప్రయోగించగలదు. అన్ని దశలలో లిక్విడ్ ఆక్సిజెన్/కిరోసిన్ ఇంజిన్‌లపై పనిచేసే అగ్నిబాణ్ కస్టమర్ల అవసరాలననుసరించి  ఇంజన్లను ఉపయోగిస్తుంది. అగ్నిబాణ్ అన్ని సమయాలలో ఒకే సంఖ్యలో ఇంజిన్‌లతో ఎగరదుమిషన్, ఉపగ్రహం మరియు ప్రయోగ ప్రదేశం వంటి అంశాలు రాకెట్ మొదటి దశలో ఎన్ని ఇంజన్లు ఉంచాలో  నిర్ణయిస్తాయి.


పూర్తిగా మొబైల్ ప్రయోగ వేదిక (ధనుష్) నుండి అగ్నిబాణ్ ను ప్రయోగించవచ్చు. అందువల్ల ప్రపంచంలో 10 కంటే ఎక్కువ లాంచ్‌పోర్ట్‌లను నుండి  ప్రయోగించడానికి అవకాశం ఉన్నది.

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ రాకెట్ విక్రమ్-ఎస్

ఒక చారిత్రాత్మక అంతరిక్ష యాత్రలో, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ విక్రమ్-ఎస్ రాకెట్ యొక్క తొలి ప్రయోగం 'ప్రారంభ్' నవంబర్ రెండవ వారంలో నిర్వహించేందుకు గాను పనుకు ముమ్మరంగా సాగుతున్నాయి.  


భారతదేశంలోని రాకెట్ ప్రయోగాలను, ఇప్పటి వరకు వివిధ రాకెట్లను స్వయంగా రూపొందించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రోమాత్రమే నిర్వహుస్తున్నది. హైదరాబాద్ కు చెందిన  'స్కైరూట్ ఏరోస్పేస్' సంస్థ  రూపొందించిన విక్రమ్-ఎస్ అనే రాకెట్‌ ను నవంబర్ రెండో వారంలో శ్రీహరికోటలోని ఇస్రో అంతరిక్ష ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపనున్నారు. ఇది దేశంలోని ఒక ప్రైవేట్ సంస్థ చేసే మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగ మౌతుంది



స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ మరియు సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన ప్రయోగం గురించి మాట్లాడుతూ, నవంబర్ 12 మరియు 16 మధ్య ప్రయోగం జరగనున్నట్లు ఇస్రో అధికారులు ప్రకప్టించారని, వాతావరణ పరిస్థితుల ననుసరించి  ప్రయోగ తేదీ  ఖరారైతుందని  చెప్పారు.


ప్రైవేట్ రంగం తరహా రాకెట్ల రూపకల్పన చేయడం మరియు అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా రంగంలోకి వాణిజ్య పరంగా వినియోగదారులను (కస్టమర్స్) మరియు పెట్టుబడులను కూడా ఆకర్షించగల సామర్థ్యం కలిగి ఉండే కీలకమైన దశను చేరుతుంది. అమెరికా, యూరప్ మరియు రష్యాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు తమ అంతరిక్ష రంగాలను ప్రైవేట్ సంస్థల కోసం తెరిచాయి అనతికాలంలోనే  స్పేసెక్స్, బ్లూ ఆరిజిన్ వంటి కంపెనీల గణనీయ ఎదుగుదల  కనిపిస్తుంది. భారతదేశం ఇటీవల తన అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ కంపెనీల కోసం తెరిచింది. సంక్లిష్టమైన డిజైన్‌ల సంబంధించిన నైపుణ్యం మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో ప్రైవేట్ కంపెనీలతో కలిసి ఇస్రో మరియు ఇన్‌స్పేస్ రాకెట్ సంస్థ పని చేస్తున్నాయి.


విక్రమ్-ఎస్ మరియు ప్రారంభ్ స్పేస్ మిషన్ వివరాలు 


ప్రయోగంలో విక్రమ్-ఎస్ రాకెట్ మూడు ఉపకరణాలను (పేలోడ్స్),  అంతరిక్షం  ప్రారంభమయ్యే కార్మెన్ రేఖను దాటి 120 కి.మీ భూసమీప ఉప-కక్ష్య (సబ్ ఆర్బిటల్) లోకి పంపనున్నది. మొత్తం సుమారు 80 కిలోగ్రాముల ఉపకరణాలను ఉప-కక్ష్య లోకి పంప గలిగిన సామర్ధ్యం  విక్రమ్-ఎస్ రాకెట్ కు ఉన్నది. స్పేస్‌కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో అమెరికా, ఇండోనేషియా, సింగపూర్ మరియు భారతదేశం కు చెందిన  విద్యార్థులు, తమ తాతయ్యలతో కలసి  రూపొందించిన 2.5 కిలోల బరువు కలిగిన ఫన్‌శాట్ మూడు ఉపకరణాల లో ఒకటి


కేవలం ఘన ఇంధనంతో పనిచేసే జే ఒక దశ (స్టేజి) గల విక్రమ్-ఎస్ రాకెట్ తొలి ప్రయోగాత్మక యానం (ఎక్ష్పెరిమెంటల్ ఫ్లైట్) ద్వారామూడు ఉపకరణాలను ఉప-కక్ష్య లోకి పంపడంతో పాటువిక్రమ్ సిరీస్ స్పేస్ లాంచ్ వెహికల్స్‌ కు సంబంధించిన వివిధ  సాంకేతికతలను పరీక్షించి వాటి పనితనాన్ని ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నాగ భరత్ డాకా ఒక ప్రకటనలో చెప్పారుభారత అంతరిక్ష కార్యక్రమ వ్యవస్థాపకుడు మరియు ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. విక్రమ్ సారాభాయ్‌కు నివాళిగా   ప్రయోగ వాహన శ్రేణికి 'విక్రమ్' అని పేరు పెట్టారు.


ఇస్రో మరియు ఇన్-స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) విస్తృత సహకారంతో, హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్, ప్రారంభ్ మిషన్ మరియు విక్రమ్-ఎస్  రాకెట్ ను అభివృద్ధి చేసింది.  


విక్రమ్ రాకెట్ శ్రేణిలో మూడు రూపాంతరా‌లను స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తోంది. విక్రమ్-I 480 కిలోగ్రాముల పేలోడ్‌ను భూ సమీప కక్ష్య‌కు మోసుకెళ్లగలిగితే, విక్రమ్-II 595 కిలోగ్రాముల పేలోడ్‌ను పంపగలదు. విక్రమ్-III 815 కిలోల పేలోడ్‌ను 500 కిలో మీటర్ల తక్కువ వంపు కక్ష్యకు (లో ఇంక్లినేషన్ ఆర్బిట్) ప్రయోగించగలదు. వివరాలు ఫొటొ లో ఇవ్వబడ్డాయి.


విక్రమ్-Iలో మూడు ఘన ఇంధన దశలు ఉన్నాయి. భారత రాకెట్ శాస్త్రవేత్త మరియు మాజీ రాష్ట్రపతి కలాంకు నివాళులర్పిస్తూ మూడవ దశను 'కలాం' గా పిలుస్తున్నారు. అలాగే చిన్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌కు అనువుగా ఒక ద్రవ ఇంధన కిక్ దశ (రామన్) ను కూడా రూపొందించారు.  24 గంటల్లో ప్రయోగ సైట్ నుండి అయినా  ప్రయోగించేందుకు వీలుగా రూపొందించబడిందని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.


విక్రమ్-2 ఎగువ దశలో క్రయోజెనిక్ ఇంజిన్ ను ఉపయోగిస్తారు. లిక్విడ్ నేచురల్ గ్యాస్ (ఎల్.ఎన్.జి) మరియూ  లిక్విడ్ ఆక్సిజన్ (ఎల్..ఎక్స్) ఇంధనాలతో ఇంజన్ పనిచేస్తుంది. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి కీలక రూప శిల్పిగా గౌరవించబడుతున్న ఇస్రో మాజీ ఛైర్మన్ డా. సతీష్ ధావన్ గౌరవార్థం స్కైరూట్ తన క్రయోజెనిక్ ఇంజిన్‌కు ధావన్-I అని పేరు పెట్టింది. ప్రోటోటైప్ ఇంజన్ తయారీ పూర్తి చేసిన ఒక సంవత్సరంలోనే 'ధావన్-I' ఇంజన్ పై స్థిర పరిక్షను  విజయవంతంగా నిర్వహించారు



ఘన ఇంధన మోటార్లు, ద్రవ ఇంధన ఇంజన్లు, క్రయోజెనిక్ ఇంజిన్ పై స్థిర పరిక్షలు నిర్వహించటానికి అవసరమైన టెస్ట్ స్టాండ్లను నాగ్‌పూర్‌లోని 'సోలార్ ఇండస్ట్రీస్ ఇండియాలో' స్కైరూట్ దేశీయంగా అభివృద్ధి చేసి, నెలకొల్పింది.  




స్కైరూట్ ఏరోస్పేస్ గురించి ... 


స్కైరూట్ హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. హైదరాబాద్‌ నగరం అంతరిక్ష ఆధారిత కంపెనీలకు మంచి అనుకూల వ్యవస్థను (ఎకో సిస్టం) కలిగి ఉందివిక్రమ్ రాకెట్‌లను అభివృద్ధి చేయడంలో స్కైరూట్ కంపెనీకి అవసరమైన సహాయ సహకారాలను, మార్గదర్శకత్వాన్ని, నైపుణ్యాన్ని ఇస్రో నిరంతరం అందిస్తోంది.


మైంత్రా సంస్థ వ్యవస్థాపకుడు ముఖేష్ బన్సాల్ నుండి లభించిన ఆర్ధిక సహాయంతో (సీడ్ ఫండింగ్‌తో), ఐఐటి ఖరగ్‌పూర్ మరియు ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్ధులు పవన్ చందన మరియు భరత్ డాకా నేతృత్వంలో కంపెనీ 2018లో ప్రారంభమైందిరెండు సంవత్సరాల తరువాత, ఘన ఇంధన రాకెట్ దశ, తర్వాత పూర్తి స్థాయి లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన మొదటి భారతీయ ప్రైవేట్ కంపెనీగా నిలిచింది.


2021లో రాకెట్ల అభివృద్ధికి దాని సౌకర్యాలు మరియు నైపుణ్యాన్ని ఉపయోగించేందుకు ఇస్రోతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కంపెనీ అదనంగా $4.5 మిలియన్లను సేకరించింది. మొత్తం $17 మిలియన్లు నిధులతో. మూడు సంవత్సరాలలోతన రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపడానికి సిద్ధంగా ఉంది.


మరిన్ని వివరాలకు ఈ వీడియోను వీక్షించండి.