Saturday, November 12, 2022

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ రాకెట్ విక్రమ్-ఎస్

ఒక చారిత్రాత్మక అంతరిక్ష యాత్రలో, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ విక్రమ్-ఎస్ రాకెట్ యొక్క తొలి ప్రయోగం 'ప్రారంభ్' నవంబర్ రెండవ వారంలో నిర్వహించేందుకు గాను పనుకు ముమ్మరంగా సాగుతున్నాయి.  


భారతదేశంలోని రాకెట్ ప్రయోగాలను, ఇప్పటి వరకు వివిధ రాకెట్లను స్వయంగా రూపొందించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రోమాత్రమే నిర్వహుస్తున్నది. హైదరాబాద్ కు చెందిన  'స్కైరూట్ ఏరోస్పేస్' సంస్థ  రూపొందించిన విక్రమ్-ఎస్ అనే రాకెట్‌ ను నవంబర్ రెండో వారంలో శ్రీహరికోటలోని ఇస్రో అంతరిక్ష ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపనున్నారు. ఇది దేశంలోని ఒక ప్రైవేట్ సంస్థ చేసే మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగ మౌతుంది



స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ మరియు సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన ప్రయోగం గురించి మాట్లాడుతూ, నవంబర్ 12 మరియు 16 మధ్య ప్రయోగం జరగనున్నట్లు ఇస్రో అధికారులు ప్రకప్టించారని, వాతావరణ పరిస్థితుల ననుసరించి  ప్రయోగ తేదీ  ఖరారైతుందని  చెప్పారు.


ప్రైవేట్ రంగం తరహా రాకెట్ల రూపకల్పన చేయడం మరియు అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా రంగంలోకి వాణిజ్య పరంగా వినియోగదారులను (కస్టమర్స్) మరియు పెట్టుబడులను కూడా ఆకర్షించగల సామర్థ్యం కలిగి ఉండే కీలకమైన దశను చేరుతుంది. అమెరికా, యూరప్ మరియు రష్యాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు తమ అంతరిక్ష రంగాలను ప్రైవేట్ సంస్థల కోసం తెరిచాయి అనతికాలంలోనే  స్పేసెక్స్, బ్లూ ఆరిజిన్ వంటి కంపెనీల గణనీయ ఎదుగుదల  కనిపిస్తుంది. భారతదేశం ఇటీవల తన అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ కంపెనీల కోసం తెరిచింది. సంక్లిష్టమైన డిజైన్‌ల సంబంధించిన నైపుణ్యం మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో ప్రైవేట్ కంపెనీలతో కలిసి ఇస్రో మరియు ఇన్‌స్పేస్ రాకెట్ సంస్థ పని చేస్తున్నాయి.


విక్రమ్-ఎస్ మరియు ప్రారంభ్ స్పేస్ మిషన్ వివరాలు 


ప్రయోగంలో విక్రమ్-ఎస్ రాకెట్ మూడు ఉపకరణాలను (పేలోడ్స్),  అంతరిక్షం  ప్రారంభమయ్యే కార్మెన్ రేఖను దాటి 120 కి.మీ భూసమీప ఉప-కక్ష్య (సబ్ ఆర్బిటల్) లోకి పంపనున్నది. మొత్తం సుమారు 80 కిలోగ్రాముల ఉపకరణాలను ఉప-కక్ష్య లోకి పంప గలిగిన సామర్ధ్యం  విక్రమ్-ఎస్ రాకెట్ కు ఉన్నది. స్పేస్‌కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో అమెరికా, ఇండోనేషియా, సింగపూర్ మరియు భారతదేశం కు చెందిన  విద్యార్థులు, తమ తాతయ్యలతో కలసి  రూపొందించిన 2.5 కిలోల బరువు కలిగిన ఫన్‌శాట్ మూడు ఉపకరణాల లో ఒకటి


కేవలం ఘన ఇంధనంతో పనిచేసే జే ఒక దశ (స్టేజి) గల విక్రమ్-ఎస్ రాకెట్ తొలి ప్రయోగాత్మక యానం (ఎక్ష్పెరిమెంటల్ ఫ్లైట్) ద్వారామూడు ఉపకరణాలను ఉప-కక్ష్య లోకి పంపడంతో పాటువిక్రమ్ సిరీస్ స్పేస్ లాంచ్ వెహికల్స్‌ కు సంబంధించిన వివిధ  సాంకేతికతలను పరీక్షించి వాటి పనితనాన్ని ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నాగ భరత్ డాకా ఒక ప్రకటనలో చెప్పారుభారత అంతరిక్ష కార్యక్రమ వ్యవస్థాపకుడు మరియు ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. విక్రమ్ సారాభాయ్‌కు నివాళిగా   ప్రయోగ వాహన శ్రేణికి 'విక్రమ్' అని పేరు పెట్టారు.


ఇస్రో మరియు ఇన్-స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) విస్తృత సహకారంతో, హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్, ప్రారంభ్ మిషన్ మరియు విక్రమ్-ఎస్  రాకెట్ ను అభివృద్ధి చేసింది.  


విక్రమ్ రాకెట్ శ్రేణిలో మూడు రూపాంతరా‌లను స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తోంది. విక్రమ్-I 480 కిలోగ్రాముల పేలోడ్‌ను భూ సమీప కక్ష్య‌కు మోసుకెళ్లగలిగితే, విక్రమ్-II 595 కిలోగ్రాముల పేలోడ్‌ను పంపగలదు. విక్రమ్-III 815 కిలోల పేలోడ్‌ను 500 కిలో మీటర్ల తక్కువ వంపు కక్ష్యకు (లో ఇంక్లినేషన్ ఆర్బిట్) ప్రయోగించగలదు. వివరాలు ఫొటొ లో ఇవ్వబడ్డాయి.


విక్రమ్-Iలో మూడు ఘన ఇంధన దశలు ఉన్నాయి. భారత రాకెట్ శాస్త్రవేత్త మరియు మాజీ రాష్ట్రపతి కలాంకు నివాళులర్పిస్తూ మూడవ దశను 'కలాం' గా పిలుస్తున్నారు. అలాగే చిన్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌కు అనువుగా ఒక ద్రవ ఇంధన కిక్ దశ (రామన్) ను కూడా రూపొందించారు.  24 గంటల్లో ప్రయోగ సైట్ నుండి అయినా  ప్రయోగించేందుకు వీలుగా రూపొందించబడిందని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.


విక్రమ్-2 ఎగువ దశలో క్రయోజెనిక్ ఇంజిన్ ను ఉపయోగిస్తారు. లిక్విడ్ నేచురల్ గ్యాస్ (ఎల్.ఎన్.జి) మరియూ  లిక్విడ్ ఆక్సిజన్ (ఎల్..ఎక్స్) ఇంధనాలతో ఇంజన్ పనిచేస్తుంది. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి కీలక రూప శిల్పిగా గౌరవించబడుతున్న ఇస్రో మాజీ ఛైర్మన్ డా. సతీష్ ధావన్ గౌరవార్థం స్కైరూట్ తన క్రయోజెనిక్ ఇంజిన్‌కు ధావన్-I అని పేరు పెట్టింది. ప్రోటోటైప్ ఇంజన్ తయారీ పూర్తి చేసిన ఒక సంవత్సరంలోనే 'ధావన్-I' ఇంజన్ పై స్థిర పరిక్షను  విజయవంతంగా నిర్వహించారు



ఘన ఇంధన మోటార్లు, ద్రవ ఇంధన ఇంజన్లు, క్రయోజెనిక్ ఇంజిన్ పై స్థిర పరిక్షలు నిర్వహించటానికి అవసరమైన టెస్ట్ స్టాండ్లను నాగ్‌పూర్‌లోని 'సోలార్ ఇండస్ట్రీస్ ఇండియాలో' స్కైరూట్ దేశీయంగా అభివృద్ధి చేసి, నెలకొల్పింది.  




స్కైరూట్ ఏరోస్పేస్ గురించి ... 


స్కైరూట్ హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. హైదరాబాద్‌ నగరం అంతరిక్ష ఆధారిత కంపెనీలకు మంచి అనుకూల వ్యవస్థను (ఎకో సిస్టం) కలిగి ఉందివిక్రమ్ రాకెట్‌లను అభివృద్ధి చేయడంలో స్కైరూట్ కంపెనీకి అవసరమైన సహాయ సహకారాలను, మార్గదర్శకత్వాన్ని, నైపుణ్యాన్ని ఇస్రో నిరంతరం అందిస్తోంది.


మైంత్రా సంస్థ వ్యవస్థాపకుడు ముఖేష్ బన్సాల్ నుండి లభించిన ఆర్ధిక సహాయంతో (సీడ్ ఫండింగ్‌తో), ఐఐటి ఖరగ్‌పూర్ మరియు ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్ధులు పవన్ చందన మరియు భరత్ డాకా నేతృత్వంలో కంపెనీ 2018లో ప్రారంభమైందిరెండు సంవత్సరాల తరువాత, ఘన ఇంధన రాకెట్ దశ, తర్వాత పూర్తి స్థాయి లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన మొదటి భారతీయ ప్రైవేట్ కంపెనీగా నిలిచింది.


2021లో రాకెట్ల అభివృద్ధికి దాని సౌకర్యాలు మరియు నైపుణ్యాన్ని ఉపయోగించేందుకు ఇస్రోతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కంపెనీ అదనంగా $4.5 మిలియన్లను సేకరించింది. మొత్తం $17 మిలియన్లు నిధులతో. మూడు సంవత్సరాలలోతన రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపడానికి సిద్ధంగా ఉంది.


మరిన్ని వివరాలకు ఈ వీడియోను వీక్షించండి.  


No comments: