నవంబర్ 26, 2022 న జరిగిన పీ.ఎస్.ఎల్.వీ-సీ54 ప్రయోగంలో హైదరాబాద్‌కు చెందిన ధృవ స్పేస్ స్వయంగా రూపొందించిన సూక్ష్మ (నానో) ఉపగ్రహాలు థైబోల్ట్-1 మరియు థైబోల్ట్-2 లను, మిగిలిన 2 ఉపగ్రహాలతో పాటు జయప్రదంగా నిర్ణీత కక్ష్యలోకి పంపబడ్డాయి. ఇవి, భారత్ లో ప్రైవేట్ రంగం తయారు చేసిన తొలి ఉపగ్రహాలు.
తక్కువ డేటా రేట్ కమ్యూనికేషన్ కోసం థైబోల్ట్-1 మరియు థైబోల్ట్-2 ఉపయోగ పడతాయి. పొలాలలో నేల పర్యవేక్షణ మరియు పంట నాణ్యత, పైప్లైన్ల లీకేజీలను గుర్తించి తక్షణమే తెలియజేయడం, వాహన పార్కింగ్ స్థలాల లభ్యత, సరఫరా గొలుసు (సప్లై చైన్) పర్యవేక్షణ, ఫారెస్ట్ ఫైర్ డిటెక్షన్ కోసం రిమోట్ లొకేషన్‌లతో కనెక్ట్ చేయడం వంటి తక్కువ డేటా రేట్ కమ్యూనికేషన్ అవసరాలకు ఈ సూక్ష్మ ఉపగ్రహాలను ఉపయోగించుకోవచ్చు.
అంతరిక్ష రంగంలో ఇస్రో గొప్ప ప్రగతిని సాధించింది.అయితే వాణిజ్యపరంగా శాటిలైట్లను తయారు చేసే సంస్థలు మా దగ్గర లేవు’’ అని ధ్రువ స్పేస్ వ్యవస్థాపక బృందం సభ్యుడు చైతన్య దొర సూరపురెడ్డి అన్నారు.
"మేము మా ఉపగ్రహాలను పాశ్చాత్య దేశాలలో నిర్మించిన వాటి కంటే చాలా రెట్లు తక్కువ ఖర్చుతో తయారు చేసాము. తద్వారా ప్రపంచ అంతరిక్ష మార్కెట్‌లో భారతదేశం యొక్క గిరాకీ పెరుగుతుంది" అని ధ్రువ స్పేస్ వ్యవస్థాపక బృందం సభ్యుడు చైతన్య దొర సూరపురెడ్డి అన్నారు.
ధృవ స్పేస్ ప్రమోటర్లు సంజయ్ నెక్కంటి, కృష్ణ తేజ పెనమకూరు, అభయ్ ఏగూర్ మరియు చైతన్య దొర సూరపురెడ్డి. |
ధృవ స్పేస్‌ను 2012లో సంజయ్ నెక్కంటి స్థాపించారు. 2010లో ప్రారంభించబడిన స్టడ్‌శాట్‌ను నిర్మించిన హైదరాబాద్ మరియు బెంగళూరులోని ఏడు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులలో ఇతను ఒకడు. 2019లో, ఆయన స్నేహితులు కృష్ణ తేజ, అభయ్, చైతన్య దొర చేరారు.
No comments:
Post a Comment