నవంబర్ 28, 2022: మన దేశ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన రంగ అంకుర సంస్థలలో (స్టార్ట్-అప్) ప్రముఖ మైనది అగ్నికుల్ కాస్మోస్. ఈ సంస్థ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) షార్‌లో, త్వరలో ప్రయోగించబోయే తమ అగ్నిబాణ్ రాకెట్ కొరకు ప్రయోగ వేదిక (లాంచ్‌ప్యాడ్) ను మరియూ నియంత్రణ కేంద్రాన్ని (మిషన్ కంట్రోల్ సెంటర్) ఏర్పాటు చేసింది. నవంబర్ 25, 2022న ఇస్రో అద్యక్షుడు మరియూ కార్యదర్శి, అంతరిక్ష విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ - డి.ఓ.ఎస్) శ్రీ ఎస్. సోమనాథ్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ సదుపాయాలు, దేశంలో ప్రైవేట్ రంగం రూపొందించిన తొలి రాకెట్ ప్రయోగ వసతులు. వివిధ ఇస్రో కేంద్రాల డైరెక్టర్లతో పాటు ఇస్రో సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, శ్రీ సోమనాథ్ దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఇప్పుడు భారతదేశ ప్రైవేట్ రంగం నిర్మించిన ప్రయోగ వేదిక నుండి అంతరిక్షంలోకి రాకెట్లను పంపగలుగుతుంది.
ఇస్రో యొక్క లాంచ్ ఆపరేషన్స్ టీమ్‌లతో కలిసి పనిచేస్తూనే మా స్వంత లాంచ్‌ప్యాడ్ నుండి ప్రయోగించే సామర్థ్యాన్ని ఇస్రో & ఇన్-స్పేస్ మాకు అందింస్తున్నందుకు అగ్నికుల్ వ్యవస్థాపకులు శ్రీనాథ్ రవిచంద్రన్ మరియూ మొయిన్ కృతజ్ఞతలు తెలుపారు. ఇస్రో తీసుకువచ్చిన కొత్త సంస్కరణలు అంతరిక్షంలోకి వెళ్లాలనే ప్రతి అంకుర సంస్థ కలను సాకారం చేస్తున్నాయని చెప్పారు.
త్వరలో లాంచ్‌ప్యాడ్ నుండి 4 కి.మీ దూరంలో లిక్విడ్ స్టేజ్ లో ద్రవ ఇంధనాన్ని నింపే కార్యక్రమ నియంత్రణా కేంద్రాని అగ్నికుల్ నిర్మించనుంది. ప్రయోగ సమయంలో కీలక భద్రతా అంశాలను పర్యవేక్షించడం మరియు షార్ నియంత్రణ కేం సెంటర్‌తో డేటాను అగ్నికుల్ సిబ్బంది పంచు కుంటుకుంది. తమ 2-దశల రాకెట్ అగ్నిబాణ్ యొక్క తొలి ప్రయోగంలో, 100 కిలోల బరువున్న ఉపకరణాలను (పేలోడ్‌ను) సుమారు 700 కి.మీ ఎత్తుకు తీసుకువెళ్లాలని అగ్నికుల్ భావిస్తున్నది.
రాకెట్ ప్రయోగవేదిక |
అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై (ఐ.ఐ.టి మద్రాస్) లో ప్రారంభించబడిన అంకుర సంస్థ. దీనిని 2017లో శ్రీనాథ్ రవిచంద్రన్, ఎస్.పీ.ఎం. మొయిన్, మరియూ ప్రొఫెసర్ ఎస్.ఆర్. చక్రవర్తి స్థాపించారు. ఆత్మనిర్భర్ భారత్ పథకానికి అణుగుణంగా అంతరిక్ష కార్యక్రమాలను స్వయంగా రూపొందించిన సంకేతికతతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అగ్నికుల్ పురోగమిస్తున్నది. ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. ఇన్-స్పేస్ తో డిసెంబర్ 2020లో ఒప్పందం ప్రకారం, ఇస్రో మార్గదర్శనలో స్వంత రాకెట్లు మరియు లాంచ్‌ప్యాడ్ ను అగ్నికుల్ నిర్మించింది.
No comments:
Post a Comment