నవంబర్ 26,2022: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (ఎస్.డీ.ఎస్.సి షార్) లోని మొదటి ప్రయోగ వేదిక (ఫస్ట్ లాంచ్ పాడ్ - ఎఫ్.ఎల్.పి) నుండి,శనివారం, నవంబర్ 26, 2022 ఉదయం 11:56 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీ.ఎస్.ఎల్వీ)-సి54 రాకెట్ ను ఇస్రో జయప్రదంగా ప్రయోగించింది. 25 ఉదయం 10:30 గం. కు ప్రయోగం యొక్క కౌంట్ డౌన్ ప్రారంభించారు.
ఈ ప్రయోగంలో పీ.ఎస్.ఎల్వీ రాకెట్ ఓషన్‌శాట్-2 (ఇది భూపరిశీలన ఉపగ్రహల (ఎర్త్ రిసోర్స్ శాట్లైట్, ఈ.ఓ.ఎస్) కోవకు చెందిన 6 వది, ఓషన్‌శాట్ శ్రేణిలో రెండవది) ను, మరియు ఎనిమిది సూక్ష్మ (నానో) ఉపగ్రహాలను, రెండు వేర్వేరు సూర్యానువర్తన ధృవ కక్ష్యలలోకి (సన్ సింక్రొనస్ పోలార్ ఆర్బిట్ - ఎస్.ఎస్.పీ.ఓ) ఇస్రో జయప్రదంగా ప్రయోగించింది. ఇది పీ.ఎస్.ఎల్వీ ప్రయోగాల పరంపరలో 56వది, మరియు 6 ఘన ఇంధన స్ట్రాపాన్లతో గూడిన పీ.ఎస్.ఎల్వీ-ఎక్స్.ఎల్ వెర్షన్ యొక్క ప్రయోగాల పరంపరలో 24వది.
ప్రస్తుతం సముద్రాల అధ్యయనానికి సంబంధించిన వివిధ అంశాలపై సాంకేతిక పరమైన విషయాలను పరిశీలించి సంబంధిత శాస్త్రవేత్తలకు ఓషన్‌శాట్-1 అందిస్తున్నది. ఆ సేవలను కొనసాగించటానికిగాను మెరుగైన ఉపకరణాలతో రూపొందించబడిన ఓషన్‌శాట్-2 ను పీ.ఎస్.ఎల్వీ-సి54 ప్రయోగం ద్వారా సూర్యానువర్తన ధృవ కక్ష్యలలోకి ఇస్రో పంపుతున్నది. ఓషన్‌శాట్-2 ఈ.ఓ.ఎస్-06 శ్రేణిలో మూడవ తరానికి చెందిన ఉపగ్రహం.
మిగిలిన ఎనిమిది సూక్ష్మ ఉపగ్రహాలు:
- భూటాన్ దేశం కోసం ఇస్రో రూపిందించిన ఐ.ఎన్.ఎస్. (INS)-2B,
- భూ పరిశీలన కోసం సూక్ష్మీకరించిన భూ-పరిశీలన కెమెరా యొక్క సామర్థ్యాలు మరియు వాణిజ్య అనువర్తనాలను (అప్లికేషన్స్) పరీక్షించడానికి భూమి సమీప కక్ష్యలోకి పంపబడుతున్న 'ఆనంద్' నానో ఉపగ్రహం,
- ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరిజ్ఞనాన్ని పరీక్షించడం కోసం పంపబడుతున్న 'ఆస్ట్రోకాస్ట్' ఉపగ్రహాలు నాలుగు.
- బహుళ వినియోగదారుల కోసం వేగవంతమైన సాంకేతిక ప్రదర్శన మరియు కాన్స్టెలేషన్ అభివృద్ధిని అంతరిక్షంలో పరీక్షించడం కోసం థైబోల్ట్ సూక్ష్మ ఉపగ్రహాలు రెండు. కనీస 1 సంవత్సరం పాటు నిర్దిష్ట కార్యకలాపాలను నిర్వహించడానికి ధృవ స్పేస్ ఆర్బిటల్ డిప్లాయర్ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా ఈ ఉపగ్రహాలు పని చేస్తాయి.
No comments:
Post a Comment