Friday, November 11, 2022

దేశీయగా రూపుదిద్దుకుంటున్న పునర్వినియోగ స్పేస్ షటిల్ కు ల్యాండింగ్‌ పరీక్షలు

నవంబర్ 10, 2022:  పునర్వినియోగ లాంచ్ వెహికల్స్ (రీయూజబుల్ లాంచ్ వెహికల్ - ఆర్.ఎల్.వీ) అభివృద్ధి అనేది ఒక సాంకేతిక సవాలు మరియు ఇది అనేక అత్యాధునిక సాంకేతికతలను కలిగి ఉంటుంది. దీనిని ప్రయోగించే ముందు, సాంకేతిక ప్రదర్శన కొరకు ప్రయోగాత్మక  పరిక్షలు నిర్వహించాలి. దీనిలో భాగంగా, ప్రస్థుతం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్జనైజేషన్- ఇస్రో) ఆర్.ఎల్.వీ కొరకు మొదటి రన్‌వే ల్యాండింగ్ ప్రయోగానికి సిద్ధమైతున్నదికర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుండి మేడ్-ఇన్-ఇండియా రీయూజబుల్ లాంచ్

వెహికల్ - టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ (ఆర్.ఎల్.వీ- టి.డి) యొక్క మొదటి రన్‌వే ల్యాండింగ్ ప్రయోగానికి (ఆర్.ఎల్.వీ- ఎల్..ఎక్స్) సన్నద్ధమైతున్నది. అయితే, ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేనందున, గాలి మరియు ఇతర వ్యవస్థలు అనుకూలంగా మారే వరకు వేచి చూస్తున్నామని ఇస్రో ఛైర్మన్ మరియూ అంతరిక్ష శాఖ కార్యదర్శి ఎస్. సోమనాథ్  పత్రికలవారితో అన్నారు. .

ఇస్రో అధికారుల ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆర్.ఎల్.వీ- ఎల్..ఎక్స్ ప్రయోగంలో రెక్కలతోగూడిన షటిల్ వాహనం (వింగ్డ్ బాడీ) ఆర్.ఎల్.వీని హెలికాప్టర్ ద్వారా మూడు నుండి ఐదు కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళతారు. మరియు రన్‌వే నుండి నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో సమాంతర వేగంతో విడుస్తారు.

విడిచిన తర్వాత, ఆర్.ఎల్.వీ గాలిలో తేలుతూ రన్‌వే వైపు మార్గ మార్గనిర్దేశం చేయబడుతుందిఅలా గాలిలో తేలుతూ చిత్రదుర్గ సమీపంలోని డిఫెన్స్ ఎయిర్ ‌ఫీల్డ్‌లో ల్యాండింగ్ గేర్‌ తో స్వయంప్రతిపత్తితో భూమిపై సురక్షితంగా దిగుతుంది. ల్యాండింగ్ గేర్, పారాచూట్, హుక్ బీమ్ అసెంబ్లీ, రాడార్ ఆల్టిమీటర్ మరియు సూడోలైట్ వంటి కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేసి అర్హత సాధించామని ఇస్రో  తెలిపింది. .రన్‌వేపైకి చేరటం మరియు స్వయం ప్రతిపత్తితో భూమిపైకి దిగటం వంటి సంక్లిష్ట సాంకేతికతలను  ఆర్.ఎల్.వీ- ఎల్..ఎక్స్ ప్రయోగంలో  ఇస్రో ప్రదర్శిస్తుంది

ఆర్.ఎల్.వీ. కి సంబంధించిన తొలి ప్రయోగం ఆర్.ఎల్.వీ-టీ.డీ.హె..ఎక్స్-01 (ఆర్.ఎల్.వీ - టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్‌పెరిమెంట్-01)  మే 23, 2016 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (ఎస్.డ్.ఎస్.సి.) షార్ నుండి  జయప్రదంగా జరిగింది. భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఉత్పన్నమయ్యే అధిక ఉష్ణొగ్రతలను తట్టుకునే రీ-ఎంట్రీ వాహనాల రూపకల్పన మరియు ప్రయోగానికి సంబంధించిన పరీక్షల కోసం రూపొందించిన సంక్లిష్ట సాంకేతికతలను ప్రయోగంలో ఇస్రో విజయవంతంగా ప్రదర్శించింది. అయితే, ఈప్రయోగంలో ఆర్.ఎల్.వీని తక్కువ ఎత్తులోని ఉపకక్ష్య (సబార్బిటల్) లోకి వదిలిసముద్రం మీద దిగేలా  ఏర్పాటు  చేసారు.  1.5 టన్ను బరువు రెక్కలతోగూడిన వాహనాన్నిఘన ఇంధన బూస్టర్‌ గల రాకెట్ పై ఉంచి, 65 కి.మీ ఎత్తుకు పంపబడింది. ధ్వని వేగానికి కన్న 5 రెట్ల వేగంతో ఉపకక్ష్యలో పరిభ్రమించి, తర్వాత వాతవరణంలొకి ప్రవేశించి, నెమ్మది నెమ్మదిగా సముద్ర జలాలలోకి దిగింది



పూర్తి స్థాయి పునర్వినియోగ ప్రయోగ వాహనం (ఎండ్-టు-ఎండ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్) యొక్క సాంకేతిక సామర్థ్యాన్ని సాధించే క్రమంలో ఆర్‌ఎల్‌వి-లెక్స్ ప్రయోగం అత్యంత కీలకమైనదిగా ఇస్రో అధికారులు భావిస్తున్నారు.


ప్రస్తుత ఉపగ్రహ ప్రయోగ వాహక రాకెట్లు పీ.ఎస్.ఎల్.వీ. /  జీ.ఎస్.ఎల్.వీ. లలో ఉపయోగించిన దశల నుండి రూపొందించనున్న రాకెట్ ద్వారా రెక్కలతోగూడిన (వింగ్డ్ బాడీ) ఆర్.ఎల్.వీ కక్ష్యలోకి తీసుకువెళ్లబడుతుంది. కక్ష్యలో పరిభ్రమిస్తూ, నిర్ణీత కాల వ్యవధి తరువాత, భూవాతావరణంలో  ప్రవేశించి, ల్యాండింగ్ గేర్‌తో స్వయంప్రతిపత్తితో రన్‌వేపై దిగుతుంది. .


No comments: