Sunday, February 19, 2023

చంద్రయాన్-3 ల్యాండర్ పై కీలక పరీక్ష విజయవంతం

ఫిబ్రవరి 19, 2023 - భెంగుళూరులోని డా. యూ.ఆర్. రావు ఉపగ్రహ కేంద్రంలో చంద్రయాన్-3 ల్యాండర్ కు సంబంధించిన విద్యుదయస్కాంత జోక్యం/ విద్యుదయస్కాంత అనుకూలత  (EMI-EMC - ఎలక్ట్రో - మాగ్నెటిక్ ఇంటర్‌ఫెరెన్స్/ ఎలక్ట్రో - మాగ్నెటిక్ కాంపాటిబిలిటీ) పరీక్షను విజయవంతంగా ఇస్రో పూర్తి చేసింది.    జనవరి 31 - ఫిబ్రవరి 2 మధ్యలో   జరిపిన   పరీక్ష విజయవంతగా  నిర్వహించబడిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం తెలిపింది.

అంతరిక్ష వాతావరణంలో ఉపగ్రహ ఉపవ్యవస్థల కార్యాచరణను మరియు ఆశించిన విద్యుదయస్కాంత స్థాయిలతో వాటి అనుకూలతను నిర్ధారించడానికి పరీక్ష నిర్వహించబడుతుంది. " పరీక్ష చంద్రయాన్-3 ఉపగ్రహా అభివృద్ధి క్రమంలో ఒక ప్రధాన మైలురాయి" అని అంతరిక్ష సంస్థ తెలిపింది.


చంద్రయాన్-3 ఇంటర్‌ప్లానెటరీ మిషన్‌లో మూడు ప్రధాన విభాగాలు (మాడ్యూల్స్) ఉన్నాయి: ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్ మరియు రోవర్ మాడ్యూల్స్ మధ్య రేడియో-ఫ్రీక్వెన్సీ (RF) కమ్యూనికేషన్ లింక్‌లను ఏర్పాటు చేయడమే ప్రయోగంలో ప్రధాన సంక్లిష్టత.


ల్యాండర్ పై నిర్వహించిన EMI/EC పరీక్షలో భాగంగా, ఉపగ్రహ వాహక రాకెట్ తో  అనుకూలత (compatibility), అన్ని RF సిస్టమ్‌ల యాంటెన్నా పోలరైజేషన్, కక్ష్య మరియు పవర్డ్ డిసెంట్ మిషన్ దశల కోసం స్వతంత్ర ఆటో అనుకూలత (Standalone auto compatibility) పరీక్షలు మరియు చంద్రుని  ఉపరితలంపై  దిగిన  తరువాత  (పోస్ట్ ల్యాండింగ్ మిషన్ దశ) కోసం ల్యాండర్ & రోవర్ అనుకూలత పరీక్షలు నిర్ధారించబడ్డాయి. వ్యవస్థల పనితీరు సంతృప్తికరంగా ఉంది' అని ఇస్రో తెలిపింది.


చంద్రయాన్-3 అనేది చంద్ర గ్రహానికి సంబంధించిన ఇస్రో నిర్వహించే మూడవ ప్రయోగం. చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా దిగటం మరియు అక్కడ సంచరించటంలో (రోవింగ్‌) పరిపూర్ణ సామర్థ్యాన్ని ప్రదర్శించడమే  యాత్ర ప్రధాన  లక్ష్యంచంద్రయాన్-2కి  కొనసాగింపుగా ప్రయోగం నిర్వహింపబడుతుంది. ఏడాది చివర్లో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఎల్.వీ,ఎం-3 ద్వారా ప్రయోగం జరుగుతుంది.


ఎనిఖాయిక్ ఛాంబర్లో చంద్రయాన్-3 ల్యాండర్ పై విద్యుదయస్కాంత జోక్యం/ విద్యుదయస్కాంత అనుకూలత కు సంబంధించిన పరిక్ష దృశ్యం  







ఒన్ వెబ్ సంస్థకు చెందిన 36 ఇంటర్నెట్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ఎల్వీఎం-3 ఉపగ్రహ వాహక రాకెట్ ని సిద్ధం చేస్తున్న ఇస్రో

యునైటెడ్ కింగ్డంకు చెందిన  నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ లిమిటెడ్ (ఒన్ వెబ్) సంస్థకు చెందిన, రెండవ విడత  36 ఇంటర్నెట్ శాటిలైట్ ఉపగ్రహాల సమూహాన్ని (కన్స్ఠలేషన్అంతరిక్షంలోకి మోహరించేందుకై  తన భారీ ప్రయోగ వాహనాన్ని  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ - ఇస్రో) సిద్ధం చేస్తోంది ప్రయోగం  మార్చి మధ్యలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జరపటానికి ముమ్మరంగా పనులు  జరుగుతున్నాయి. గత సంవత్సరం అక్టోబర్ 23  ఒన్ వెబ్ సంస్థకు చెందిన  36 ఉపగ్రహాలను మొదటి విడతగా ఎల్వీఎం-3 ద్వారా వాణిజ్య పరంగా ఇస్రో ప్రయోగించింది.  

ఉక్రెయిన్‌ యుద్ధ నేపధ్యంలో పాశ్చాత్య దేశాల నుండి ఆంక్షలనెదుర్కుంటున్న  రష్యా యునైటెడ్ కింగ్‌డమ్‌కు రాకెట్ ప్రయోగ సేవలను నిరాకరించింది.  తర్వాత ఒన్ వెబ్ సంస్థ,  ఇస్రో వాణిజ్య విభాగం - ‘న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌’ (ఎన్.ఎస్..ఎల్ ) తో కుదుర్చుకున్న  ఒప్పందం ప్రకారం 72 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి   ఇస్రో రెండు విడతలుగా పంపటానికి అంగీకారం కుదిరిందిదానికిగాను ఒన్ వెబ్ సంస్థ సుమారు రూ. 1000 కోట్లు చెల్లిస్తుంది.  ప్రపంచవ్యాప్తంగా ఒన్ వెబ్ సంస్థ ఇంటర్నెట్ సేవలను అందించడానికి 648 ఉపగ్రహాలను  భూ సమీప కక్ష్యలోకి (Low Earth Orbit - LEO) ప్రవేశపెట్టాలనుకుంటోందిదానిలో  భాగంగా ఒన్ వెబ్ ఇటీవలే ఫ్లోరిడాలోని స్పేస్‌ఎక్స్ యొక్క ప్రయోగ కేంద్రం నుండి  ఫాల్కన్ 9 రాకెట్‌లో తన 16 ప్రయోగాన్ని పూర్తి చేసింది.  ఇప్పటి వరకూ మొత్తం  542 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి.











 <    ఎల్.వీ.ఎం-3  రాకెట్ పేలోడ్ ఫెయిరింగ్ లోపల ఒన్ వెబ్ యొక్క  36 ఇంటర్నెట్ ఉపగ్రహాల అమరిక







Friday, February 10, 2023

ఎస్.ఎస్.ఎల్.వీ అవసరం ఏమిటి ?

స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వి) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్మించిన  చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం.

గిరాకీకి అనుగుణంగా భూ సమీప కక్ష్యకి 500 కిలోల వరకు ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రో ఎస్.ఎస్.ఎల్.వీ రాకెట్ ని రూపొందించిందితక్కువ ఖర్చుతో బహుళ ఉపగ్రహాలను ప్రయోగించే సౌలభ్యం, కనీస అవసర ప్రయోగ మౌళిక వసతులతో, గిరాకీకి అనుగుణంగా తక్కువ వ్యవధిలో ప్రయోగానికి సిద్ధం చేసే వీలు, వంటి వివిధ ప్రయోజనాలే  ఎస్.ఎస్.ఎల్.వీ ప్రత్యేకతలు


వివిధ దేశాలు పోటీబడుతున్న బహుళ-బిలియన్ డాలర్ల అంతరిక్ష వాణిజ్యంలో, తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను భూ సమీప కక్ష్యలోకి పంపటంలో భారతదేశానికి మంచి గిరాకీని చేకూర్చటంలో రాకెట్ సహాయపడుతుంది.

 

ఎస్.ఎస్.ఎల్.వీ, దాని వివిధ దశలు :


ప్రధానంగా ఇది  మూడు దశల రాకెట్.   మూడు దశలూ ఘన ఇంధనం పైనే  పనిచేస్తాయి. వీటికి తోడు, అదనంగా ద్రవ ఇంధన ఆధారిత వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ (వి.టి.ఎం) టెర్మినల్ దశ రాకెట్ పై భాగాన ఉంటుంది.   దీని బరువు దాదాపు 120 టన్నులుపొడవు 34 మీటర్లు , చుట్టు కొలత 2 మీటర్లు.  


తొలి దశ బరువు  87 టన్నులు ఉండగారెండు, మూడు దశల బరువు 7.7 టన్నులు మరియు 4.5 టన్నులువెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ (వి.టి,ఎం) టెర్మినల్ దశ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి  చేరుస్తుంది.  


మొదటిది దశ మోటార్  2,496 కిలో న్యూటన్ల  తోపుడు శక్తిని (Thrust)  ఇవ్వగా, రెండవ దశమూడవ దశ మోటార్లు,  234.2 కిలో న్యూటన్ల మరియు  కిలో న్యూటన్ల  తోపుడు శక్తిని (Thrust) సమకూరుస్తాయి


రోల్, పిచ్ మరియు యా కంట్రోల్ కోసం ఎనిమిది 50 న్యూటన్ల  ద్రవ ఇంధన ఇంజన్లువేగం పెంపొందించటానికి మరో ఎనిమిది 50 న్యూటన్ల  ద్రవ ఇంధన ఇంజన్లు వి.టి.ఎం లో అమర్చబడ్డాయి.  


రాకెట్ చిన్న, సూక్ష్మ లేదా నానో ఉపగ్రహాలను (10 నుండి 500 కిలోలు) 500 కి.మీ ప్లానార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు.



ఎస్.ఎస్.ఎల్.వీ తొలి ప్రయోగం విఫలం 


అనేక సంవత్సరాల అభివృద్ధి తర్వాత, ఎస్.ఎస్.ఎల్.వీ యొక్క తొలిప్రయోగం  ( ఎస్.ఎస్.ఎల్.వీ-డి 1) మైక్రో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం (EOS-02) మరియు మరొక ఉపగ్రహంతో , ఆగస్టు 7, 2022 ఉదయం 9.18 గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుండి జరిగింది. కానీ ప్రయోగం కొన్ని సాంకేతిక కారణాల వల్ల విఫలం చెందింది



ఎస్.ఎస్.ఎల్.వీ-డి-2  ప్రయోగ విజయం 


ఎస్.ఎస్.ఎల్.వీ యొక్క రెండవ ప్రయోగం (ఎస్.ఎస్.ఎల్.వీడి-2) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక  నుండి ఫిబ్రవరి 10 ఉదయం 9:18 గంటలకు జరిగింది. రాకెట్  ద్వారా  ఈఓఎస్-07 ఉపగ్రహంతో పాటు  అమెరికాకు చెందిన జానూస్-1 మరియూ భారత దేశ పాఠశాల  విద్యార్ధులు రూపొందించిన ఆజాదిశాట్-2 సూక్ష్మ ఉపగ్రహాలను (మూడింటి బరువు 334 కిలోలు),  450-కిమీ దూరంలో భూ సమీప వృత్తాకార కక్ష్యలోకి పంపడంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఘన విజయం సాధించిందినింగికెగసిన 15 నిమిషాల తరువాత, నిర్ణీత వ్యవధిలోనిర్ణీత క్రమంలో  మూడు ఉపగ్రహాలను ఒకదాని తరువాత మరొకటిగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఎస్.ఎస్.ఎల్.వీ  తొలి  ప్రయోగం విఫలమైన నేపధ్యంలో, ప్రయోగం ప్రాముఖ్యత సంతరించుకుంది.   


500 కిలోల వరకు  బరువున్న ఉపగ్రహాలను 'లాంచ్-ఆన్-డిమాండ్' ప్రాతిపదికన  భూ సమీప వృత్తాకార కక్ష్యలోకి  ప్రయోగించేందుకై రూపొందింపబడిన ఎస్.ఎస్.ఎల్.వీ ప్రయోగ విజయంతో వాణిజ్య ప్రయోగాల పరంపరలో ఇస్రో ఒక పెద్ద ముందడుగు వేసింది