Friday, February 10, 2023

ఎస్.ఎస్.ఎల్.వీ-డి-2 ప్రయోగం జయప్రదం

 చిన్న తరహా వాణిజ్య ప్రయోగాలను తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు వీలు 

ఫిబ్రవరి 10 ఉదయం 9:18 గంటలకు ప్రయోగించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్-డి-2 (ఎస్.ఎస్.ఎల్.వీడి-2) రాకెట్  ద్వారా  ఈఓఎస్-07 ఉపగ్రహంతో పాటు  అమెరికాకు చెందిన జానూస్-1 మరియూ భారత దేశ పాఠశాల  విద్యార్ధులు రూపొందించిన ఆజాదిశాట్-2 సూక్ష్మ ఉపగ్రహాలను (మూడింటి బరువు 334 కిలోలు),  450-కిమీ దూరంలో భూ సమీప వృత్తాకార కక్ష్యలోకి పంపడంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఘన విజయం సాధించిందినింగికెగసిన 15 నిమిషాల తరువాత, నిర్ణీత వ్యవధిలోనిర్ణీత క్రమంలో  మూడు ఉపగ్రహాలను ఒకదాని తరువాత మరొకటిగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ఎస్.ఎస్.ఎల్.వీ యొక్క రెండవ ప్రయోగం. ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక  నుండి నిర్వహించబడింది. గత సంవత్సరం ఆగస్టు 7 జరిగిన ఎస్.ఎస్.ఎల్.వీ యొక్క తొలి  ప్రయోగం విఫలమైన నేపధ్యంలో, ప్రయోగం ప్రాముఖ్యత సంతరించుకుంది.   


500 కిలోల వరకు  బరువున్న ఉపగ్రహాలను 'లాంచ్-ఆన్-డిమాండ్' ప్రాతిపదికన  భూ సమీప వృత్తాకార కక్ష్యలోకి  ప్రయోగించేందుకై ఎస్.ఎస్.ఎల్.వీ ని రూపొందించారు ప్రయోగ విజయంతో వాణిజ్య ప్రయోగాల పరంపరలో ఇస్రో ఒక పెద్ద ముందడుగు వేసింది


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) యొక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్.ఎస్.ఎల్.వీ), చిన్న, అతి చిన్న (సూక్ష్మ  లేదా నానో) ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగ అవసరాలకు అనుగుణంగా , తక్కువ ఖర్చుతో   పారిశ్రామిక రంగం ఉత్పత్తి చేసే విధంగా రూపొందించబడింది. ఘన ఇంధనంపై పనిచేసే మూడు దశలను, ద్రవ ఇంధనంతో  పనిచేసే వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ (వీ.టీ.ఎంను టెర్మినల్ దశను రాకెట్ కలిగి ఉన్నది.   2మీ వ్యాసం మరియు 34మీ పొడవు, సుమారు 120 టన్నుల బరువును గలిగిన  ఎస్.ఎస్.ఎల్.వీ, 500 కే.జీ బరువున్న  ఉపగ్రహాన్ని శ్రీహరికోటనుండి  నుండి 500 కి.మీ దూరంలో ప్లానార్ కక్ష్యలోకి ప్రయోగించగలదుతక్కువ ఖర్చుతో బహుళ ఉపగ్రహాలను ప్రయోగించే సౌలభ్యం, కనీస ప్రయోగ మౌళిక వసతులతో గిరాకీకి అనుగుణంగా తక్కువ వ్యవధిలో ప్రయోగానికి సిద్ధం చేసే వీలు వంటి  వివిధ ప్రయోజనాలే  ఎస్.ఎస్.ఎల్.వీ ప్రత్యేకతలు


ఈఓఎస్-07 ఉపగ్రహం బరువు 156.3 కిలోలు. దీనిని ఇస్రో రూపొందించిదీనిలో  ఎం.ఎం.-వేవ్ హ్యూమిడిటీ సౌండర్ మరియు స్పెక్ట్రమ్ మానిటరింగ్ పేలోడ్ ఉన్నాయి.


జానస్-1 ఉపగ్రహం బరువు 10.2 కిలోలు. దీన్ని అమెరికాకు చెందిన ఆంటారిస్ సంస్థ తయారు చేసింది.   ఇది  ఆంటారిస్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సాంకేతికతతో పని  చేసే  స్మార్ట్ సూక్ష్మ ఉపగ్రహం.


8.7-కిలోల బరువున్న ఆజాదీశాట్-2 సూక్ష్మ. ఉపగ్రహన్ని, భారతదేశంలోని  వివిధ ప్రాంతాలకు చెందిన 750 మంది బాలికలుచెన్నైలోని స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ  మార్గనిర్దేశంలో  సంయుక్త రూపొందించారుఇది  ఔత్సాహిక రేడియో కమ్యూనికేషన్, మరియూ అంతరిక్షంలో రేడియేషన్ స్థాయిలను కొలవడం వంటి  పనులను లక్ష్యంగా పెట్టుకుంది.








Monday, February 6, 2023

ఎస్.ఎస్.ఎల్.వీ రెండవ ప్రయోగం ఫిబ్రవరి 10న జరపడానికి ముమ్మర సన్నాహాలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) యొక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్.ఎస్.ఎల్.వీ), చిన్న, అతి చిన్న (సూక్ష్మ  లేదా నానో) ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగ అవసరాలకు అనుగుణంగా , తక్కువ ఖర్చుతో   పారిశ్రామిక రంగం ఉత్పత్తి చేసే విధంగా రూపొందించబడింది. ఘన ఇంధనంపై పనిచేసే మూడు దశలను, ద్రవ ఇంధనంతో  పనిచేసే వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ (వీ.టీ.ఎంను టెర్మినల్ దశను రాకెట్ కలిగి ఉన్నది.   2మీ వ్యాసం మరియు 34మీ పొడవు, సుమారు 120 టన్నుల బరువును గలిగిన  ఎస్.ఎస్.ఎల్.వీ, 500 కే.జీ బరువున్న  ఉపగ్రహాన్ని శ్రీహరికోటనుండి  నుండి 500 కి.మీ దూరంలో ప్లానార్ కక్ష్యలోకి ప్రయోగించగలదుతక్కువ ఖర్చుతో బహుళ ఉపగ్రహాలను ప్రయోగించే సౌలభ్యం, కనీస ప్రయోగ మౌళిక వసతులతో గిరాకీకి  అనుగుణంగా తక్కువ వ్యవధిలో ప్రయోగానికి సిద్ధం చేసే వీలు వంటి  వివిధ ప్రయోజనాలే  ఎస్.ఎస్.ఎల్.వీ ప్రత్యేకతలు




తొలి ప్రయోగం వైఫల్యం  


ఎస్.ఎస్.ఎల్.వీ యొక్క తొలి ప్రయోగం (ఎస్.ఎస్.ఎల్.వీ-డి1 /ఈఓఎస్-02) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి 7 ఆగస్టు 2022 జరిగింది. ప్రయోగం యొక్క లక్ష్యం  ఈఓఎస్-02 ఉపగ్రహాన్ని 37.21 డిగ్రీల వాలుతో,  356.2 కి.మీ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టడందీనితో పాటు, ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలను ప్రోత్సహించడానికి  ఏర్పరచిన కొత్త నోడల్ ఏజెన్సీ  'ఇన్-స్పేస్' (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్అనుమతించిన  ఆజాదిశాట్ అనే విద్యార్థి ఉపగ్రహం కూడా ప్రయోగించబడింది.   

అయితేఅన్ని ఘన ఇంధన  దశల యొక్క పనితీరు సాధారణంగా ఉన్నప్పటికీ, వేగంలో లోపం కారణంగా  అత్యంత దీర్ఘవృత్తాకార అస్థిర కక్ష్యలోకి ప్రయోగించబడింది కారణంగా ప్రయోగం విఫలమైయింది


తొలి ప్రయోగం వైఫల్య కారణాన్ని స్పష్టంగా గుర్తించిన  నిపుణుల బృందం కొన్ని దిద్దుబాటు చర్యలను సూచించిందితదనుగుణంగా, ఎస్.ఎస్.ఎల్.వీ ని రెండవ ప్రయోగానికి (ఎస్.ఎస్.ఎల్.వీ-డి2 /ఈఓఎస్-07) సిద్ధం చేశారు. ఈఓఎస్-07 ఉపగ్రహంతో  పాటు మరో రెండు  ఉపగ్రహాలను (మొత్తం బరువు 334 కిలోలు)

 కూడా ప్రయోగంలో నింగిలోకి పంపుతారు. ప్రయోగాన్ని  ఫిబ్రవరి 10 జరపడానికి ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి

Monday, November 28, 2022

ధృవ స్పేస్ రూపొందించిన థైబోల్ట్-1 మరియు థైబోల్ట్-2 భారత్ లో తయారైన తొలి ప్రైవేట్ ఉపగ్రహాలు


నవంబర్ 26, 2022 జరిగిన పీ.ఎస్.ఎల్.వీ-సీ54 ప్రయోగంలో హైదరాబాద్‌కు చెందిన ధృవ స్పేస్ స్వయంగా రూపొందించిన సూక్ష్మ (నానో) ఉపగ్రహాలు థైబోల్ట్-1 మరియు థైబోల్ట్-2 ల‌ను, మిగిలిన 2 ఉపగ్రహాలతో  పాటు జయప్రదంగా నిర్ణీత కక్ష్యలోకి పంపబడ్డాయిఇవి, భారత్ లో ప్రైవేట్ రంగం  తయారు చేసిన తొలి  ఉపగ్రహాలు


తక్కువ డేటా రేట్ కమ్యూనికేషన్ కోసం థైబోల్ట్-1 మరియు థైబోల్ట్-2 ఉపయోగ పడతాయిపొలాలలో నేల పర్యవేక్షణ మరియు పంట నాణ్యతపైప్‌లైన్‌ల లీకేజీలను గుర్తించి తక్షణమే తెలియజేయడంవాహన పార్కింగ్ స్థలాల లభ్యతసరఫరా గొలుసు (సప్లై చైన్పర్యవేక్షణఫారెస్ట్‌ ఫైర్ డిటెక్షన్ కోసం రిమోట్ లొకేషన్‌లతో కనెక్ట్ చేయడం వంటి తక్కువ డేటా రేట్ కమ్యూనికేషన్‌ అవసరాలకు  సూక్ష్మ ఉపగ్రహాలను ఉపయోగించుకోవచ్చు.


అంతరిక్ష రంగంలో ఇస్రో గొప్ప ప్రగతిని సాధించింది.అయితే వాణిజ్యపరంగా శాటిలైట్లను తయారు చేసే సంస్థలు మా దగ్గర లేవు’’ అని ధ్రువ స్పేస్ వ్యవస్థాపక బృందం సభ్యుడు చైతన్య దొర సూరపురెడ్డి అన్నారు.


థైబోల్ట్ ఉపగ్రహం 

 "మేము మా ఉపగ్రహాలను పాశ్చాత్య దేశాలలో నిర్మించిన వాటి కంటే చాలా రెట్లు తక్కువ ఖర్చుతో తయారు చేసాముతద్వారా ప్రపంచ అంతరిక్ష మార్కెట్‌లో భారతదేశం యొక్క గిరాకీ పెరుగుతుంది"  అని ధ్రువ స్పేస్ వ్యవస్థాపక బృందం సభ్యుడు చైతన్య దొర సూరపురెడ్డి అన్నారు.



ధృవ స్పేస్ ప్రమోటర్లు సంజయ్ నెక్కంటి, కృష్ణ తేజ పెనమకూరు,
అభయ్ ఏగూర్ మరియు చైతన్య దొర సూరపురెడ్డి.

ధృవ స్పేస్‌ను 2012లో సంజయ్ నెక్కంటి స్థాపించారు. 2010లో ప్రారంభించబడిన స్టడ్‌శాట్‌ను నిర్మించిన హైదరాబాద్ మరియు బెంగళూరులోని ఏడు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులలో ఇతను ఒకడు. 2019లో, ఆయన స్నేహితులు కృష్ణ తేజ, అభయ్‌, చైతన్య దొర  చేరారు.