Monday, November 28, 2022

ధృవ స్పేస్ రూపొందించిన థైబోల్ట్-1 మరియు థైబోల్ట్-2 భారత్ లో తయారైన తొలి ప్రైవేట్ ఉపగ్రహాలు


నవంబర్ 26, 2022 జరిగిన పీ.ఎస్.ఎల్.వీ-సీ54 ప్రయోగంలో హైదరాబాద్‌కు చెందిన ధృవ స్పేస్ స్వయంగా రూపొందించిన సూక్ష్మ (నానో) ఉపగ్రహాలు థైబోల్ట్-1 మరియు థైబోల్ట్-2 ల‌ను, మిగిలిన 2 ఉపగ్రహాలతో  పాటు జయప్రదంగా నిర్ణీత కక్ష్యలోకి పంపబడ్డాయిఇవి, భారత్ లో ప్రైవేట్ రంగం  తయారు చేసిన తొలి  ఉపగ్రహాలు


తక్కువ డేటా రేట్ కమ్యూనికేషన్ కోసం థైబోల్ట్-1 మరియు థైబోల్ట్-2 ఉపయోగ పడతాయిపొలాలలో నేల పర్యవేక్షణ మరియు పంట నాణ్యతపైప్‌లైన్‌ల లీకేజీలను గుర్తించి తక్షణమే తెలియజేయడంవాహన పార్కింగ్ స్థలాల లభ్యతసరఫరా గొలుసు (సప్లై చైన్పర్యవేక్షణఫారెస్ట్‌ ఫైర్ డిటెక్షన్ కోసం రిమోట్ లొకేషన్‌లతో కనెక్ట్ చేయడం వంటి తక్కువ డేటా రేట్ కమ్యూనికేషన్‌ అవసరాలకు  సూక్ష్మ ఉపగ్రహాలను ఉపయోగించుకోవచ్చు.


అంతరిక్ష రంగంలో ఇస్రో గొప్ప ప్రగతిని సాధించింది.అయితే వాణిజ్యపరంగా శాటిలైట్లను తయారు చేసే సంస్థలు మా దగ్గర లేవు’’ అని ధ్రువ స్పేస్ వ్యవస్థాపక బృందం సభ్యుడు చైతన్య దొర సూరపురెడ్డి అన్నారు.


థైబోల్ట్ ఉపగ్రహం 

 "మేము మా ఉపగ్రహాలను పాశ్చాత్య దేశాలలో నిర్మించిన వాటి కంటే చాలా రెట్లు తక్కువ ఖర్చుతో తయారు చేసాముతద్వారా ప్రపంచ అంతరిక్ష మార్కెట్‌లో భారతదేశం యొక్క గిరాకీ పెరుగుతుంది"  అని ధ్రువ స్పేస్ వ్యవస్థాపక బృందం సభ్యుడు చైతన్య దొర సూరపురెడ్డి అన్నారు.



ధృవ స్పేస్ ప్రమోటర్లు సంజయ్ నెక్కంటి, కృష్ణ తేజ పెనమకూరు,
అభయ్ ఏగూర్ మరియు చైతన్య దొర సూరపురెడ్డి.

ధృవ స్పేస్‌ను 2012లో సంజయ్ నెక్కంటి స్థాపించారు. 2010లో ప్రారంభించబడిన స్టడ్‌శాట్‌ను నిర్మించిన హైదరాబాద్ మరియు బెంగళూరులోని ఏడు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులలో ఇతను ఒకడు. 2019లో, ఆయన స్నేహితులు కృష్ణ తేజ, అభయ్‌, చైతన్య దొర  చేరారు.  


ప్రైవేట్ అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలు రాయి - ప్రైవేట్ రంగ తొలి రాకెట్ ప్రయోగ వేదిక మరియూ నియంత్రణ కేంద్రం ప్రారంభం

నవంబర్ 28, 2022: మన దేశ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన రంగ అంకుర సంస్థలలో (స్టార్ట్-అప్) ప్రముఖ మైనది అగ్నికుల్ కాస్మోస్. సంస్థ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) షార్‌లో, త్వరలో ప్రయోగించబోయే తమ అగ్నిబాణ్ రాకెట్ కొరకు ప్రయోగ వేదిక (లాంచ్‌ప్యాడ్) ను మరియూ నియంత్రణ కేంద్రాన్ని (మిషన్ కంట్రోల్ సెంటర్) ఏర్పాటు చేసింది. నవంబర్ 25, 2022 ఇస్రో అద్యక్షుడు మరియూ కార్యదర్శి, అంతరిక్ష విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ - డి..ఎస్) శ్రీ ఎస్. సోమనాథ్ చేతులమీదుగా ప్రారంభమైన సదుపాయాలు, దేశంలో ప్రైవేట్ రంగం రూపొందించిన తొలి రాకెట్ ప్రయోగ వసతులు. వివిధ ఇస్రో కేంద్రాల డైరెక్టర్లతో పాటు ఇస్రో సీనియర్ అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా, శ్రీ సోమనాథ్ దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఇప్పుడు భారతదేశ ప్రైవేట్ రంగం నిర్మించిన ప్రయోగ వేదిక నుండి అంతరిక్షంలోకి రాకెట్లను పంపగలుగుతుంది.

ఇస్రో యొక్క లాంచ్ ఆపరేషన్స్ టీమ్‌లతో కలిసి పనిచేస్తూనే మా స్వంత లాంచ్‌ప్యాడ్ నుండి ప్రయోగించే సామర్థ్యాన్ని ఇస్రో & ఇన్-స్పేస్ మాకు అందింస్తున్నందుకు అగ్నికుల్  వ్యవస్థాపకులు  శ్రీనాథ్ రవిచంద్రన్ మరియూ మొయిన్ కృతజ్ఞతలు తెలుపారు. ఇస్రో తీసుకువచ్చిన కొత్త సంస్కరణలు అంతరిక్షంలోకి వెళ్లాలనే ప్రతి అంకుర సంస్థ కలను సాకారం చేస్తున్నాయని చెప్పారు.


త్వరలో లాంచ్‌ప్యాడ్ నుండి 4 కి.మీ దూరంలో లిక్విడ్ స్టేజ్ లో ద్రవ ఇంధనాన్ని నింపే కార్యక్రమ నియంత్రణా కేంద్రాని అగ్నికుల్ నిర్మించనుంది. ప్రయోగ సమయంలో కీలక  భద్రతా అంశాలను పర్యవేక్షించడం మరియు షార్ నియంత్రణ కేం సెంటర్‌తో డేటాను అగ్నికుల్ సిబ్బంది పంచు కుంటుకుందితమ 2-దశల రాకెట్  అగ్నిబాణ్ యొక్క తొలి ప్రయోగంలో, 100 కిలోల బరువున్న ఉపకరణాలను  (పేలోడ్‌ను) సుమారు 700 కి.మీ ఎత్తుకు తీసుకువెళ్లాలని అగ్నికుల్ భావిస్తున్నది.


రాకెట్ ప్రయోగవేదిక 
అగ్నికుల్ కాస్మోస్ గురించి

అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై (..టి మద్రాస్) లో ప్రారంభించబడిన అంకుర సంస్థదీనిని 2017లో శ్రీనాథ్ రవిచంద్రన్, ఎస్.పీ.ఎం. మొయిన్మరియూ  ప్రొఫెసర్ ఎస్.ఆర్. చక్రవర్తి స్థాపించారుఆత్మనిర్భర్ భారత్ పథకానికి అణుగుణంగా అంతరిక్ష కార్యక్రమాలను స్వయంగా రూపొందించిన సంకేతికతతో  అభివృద్ధి చేయడమే  లక్ష్యంగా అగ్నికుల్ పురోగమిస్తున్నది. ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయ కంపెనీగా నిలిచిందిఇన్-స్పేస్ తో  డిసెంబర్ 2020లో ఒప్పందం ప్రకారం, ఇస్రో మార్గదర్శనలో స్వంత రాకెట్లు మరియు లాంచ్‌ప్యాడ్‌ ను  అగ్నికుల్ నిర్మించింది


Friday, November 25, 2022

పీ..ఎస్.ఎల్వీ-సి54/ఈ.ఓ.ఎస్-6 రాకెట్ ప్రయోగం జయప్రదం - ఇస్రో ఖాతాలో మరో విజయం

నవంబర్ 26,2022: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (ఎస్.డీ.ఎస్.సి షార్) లోని  మొదటి ప్రయోగ వేదిక (ఫస్ట్ లాంచ్ పాడ్ - ఎఫ్.ఎల్.పి) నుండి,శనివారం, నవంబర్ 26, 2022 ఉదయం 11:56 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీ.ఎస్.ఎల్వీ)-సి54 రాకెట్ ను ఇస్రో జయప్రదంగా ప్రయోగించింది 25 ఉదయం 10:30 గం. కు ప్రయోగం యొక్క కౌంట్ డౌన్ ప్రారంభించారు

ప్రయోగంలో పీ.ఎస్.ఎల్వీ రాకెట్ ఓషన్‌శాట్-2 (ఇది భూపరిశీలన ఉపగ్రహల (ఎర్త్ రిసోర్స్ శాట్లైట్, ..ఎస్) కోవకు చెందిన 6 వది, ఓషన్‌శాట్ శ్రేణిలో రెండవది) ను, మరియు ఎనిమిది సూక్ష్మ (నానో) ఉపగ్రహాలను, రెండు వేర్వేరు సూర్యానువర్తన ధృవ కక్ష్యలలోకి (సన్ సింక్రొనస్ పోలార్ ఆర్బిట్ - ఎస్.ఎస్.పీ.) ఇస్రో  జయప్రదంగా ప్రయోగించింది. ఇది పీ.ఎస్.ఎల్వీ ప్రయోగాల పరంపరలో 56వదిమరియు 6 ఘన ఇంధన స్ట్రాపాన్లతో గూడిన  పీ.ఎస్.ఎల్వీ-ఎక్స్.ఎల్  వెర్షన్ యొక్క ప్రయోగాల పరంపరలో 24వది.  





ప్రస్తుతం సముద్రాల అధ్యయనానికి సంబంధించిన వివిధ అంశాలపై సాంకేతిక పరమైన విషయాలను పరిశీలించి సంబంధిత శాస్త్రవేత్తలకు ఓషన్‌శాట్-1  అందిస్తున్నది. సేవలను కొనసాగించటానికిగాను మెరుగైన ఉపకరణాలతో రూపొందించబడిన ఓషన్‌శాట్-2 ను పీ.ఎస్.ఎల్వీ-సి54 ప్రయోగం ద్వారా సూర్యానువర్తన ధృవ కక్ష్యలలోకి ఇస్రో పంపుతున్నది. ఓషన్‌శాట్-2 ..ఎస్-06 శ్రేణిలో మూడవ తరానికి చెందిన ఉపగ్రహం


మిగిలిన ఎనిమిది సూక్ష్మ ఉపగ్రహాలు

  • భూటాన్ దేశం కోసం ఇస్రో రూపిందించిన .ఎన్.ఎస్. (INS)-2B, 
  • భూ పరిశీలన కోసం సూక్ష్మీకరించిన భూ-పరిశీలన కెమెరా యొక్క సామర్థ్యాలు మరియు వాణిజ్య అనువర్తనాలను (అప్లికేషన్స్) పరీక్షించడానికి భూమి సమీప కక్ష్యలోకి పంపబడుతున్న 'ఆనంద్' నానో ఉపగ్రహం,
  • ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరిజ్ఞనాన్ని పరీక్షించడం కోసం పంపబడుతున్న 'ఆస్ట్రోకాస్ట్' ఉపగ్రహాలు నాలుగు
  • బహుళ వినియోగదారుల కోసం వేగవంతమైన సాంకేతిక ప్రదర్శన మరియు కాన్స్టెలేషన్ అభివృద్ధిని అంతరిక్షంలో పరీక్షించడం కోసం థైబోల్ట్ సూక్ష్మ ఉపగ్రహాలు రెండు. కనీస 1 సంవత్సరం పాటు నిర్దిష్ట  కార్యకలాపాలను నిర్వహించడానికి ధృవ స్పేస్ ఆర్బిటల్ డిప్లాయర్‌ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా ఉపగ్రహాలు పని చేస్తాయి






Monday, November 14, 2022

భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న ప్రైవేటు భాగస్వామ్యం

గత ఆరు దశాబ్దాలుగా, ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ అంతరిక్ష కార్యక్రమాలలో ఒకటిగా ఇస్రో అభివృద్ధి చెందింది. సామాజికాభివృద్ధికి ఉపయోగపడే ఉపగ్రహ సేవలను, అంతరిక్ష ఆధారిత సాంకేతికతను ఇస్రో అందజేస్తుంది. భారత అంతరిక్ష కార్యక్రమానికి తొలి నాళ్ళనుండీ  భారతీయ పరిశ్రమ వెన్నెముకగా నిలిచిందిభవిష్యత్ కార్యక్రమాలలో కూడా, ఆసక్తి ఉన్న రంగాలలో పరిశ్రమ భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇస్రో ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది.

అంతరిక్ష రవాణా వ్యవస్థలు, గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, భూ పరిశీలన, శాటిలైట్ కమ్యూనికేషన్ అవసరాలను తీర్చే ఉపగ్రహాల సముదాయంతో కూడిన అంతరిక్ష ఆస్తులతో (Space assets) సహా అంతరిక్ష రంగంలో భారతదేశం స్వదేశీ సామర్థ్యాలను సంపాదించుకుందిజాతీయ అవసరాలు మరియు సామాజిక సాధారణ సమస్యలను పరిష్కరించడానికి అంతరిక్ష సాంకేతికత యొక్క అనువర్తనాలకు (Space technology applications) సంబంధించిన అనేక కార్యాచరణ కార్యక్రమాలను ఇస్రో నిర్వహిస్తున్నది.

ప్రభుత్వం అంతరిక్ష రంగానికి కేటాయిస్తున్న ఆర్ధిక బడ్జెట్ ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, భారత ప్రభుత్వం అంతరిక్ష రంగానికి 13,700 కోట్లను రూపాయలను కేటాయించింది. అయితే, 360 బిలియన్ అమెరికన్ డాలర్ల గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారతదేశం వాటా సుమారు రెండు శాతం మాత్రమే.

అంతరిక్ష రంగంలో ప్రవేట్  భాగస్వామ్యం ఆవశ్యకత 

రాకెట్ మరియు శాటిలైట్ లాంచ్ సర్వీసెస్ కు ధృఢమైన మౌళిక సదుపాయాలు మరియు భారీ పెట్టుబడులు అవసరం. ప్రస్తుతం, ప్రభుత్వం విభాగంలో ఒక నిర్దిష్ట స్థాయిలో ప్రభుత్వం ప్రవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించింది. లార్సెన్ & టూబ్రో, గోద్రేజ్ మరియు టాటా వంటి పెద్ద సంస్థలు ఇస్రోకు దీర్ఘకాలిక విక్రేతలు. మౌలిక సదుపాయాల కల్పనరాకెట్ దశలను తయారీ, పరీక్షించడం, అనుసంధానం వంటి సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. అయితే, తరహా సేవలు  వారి మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో కొద్ది భాగం మాత్రమే. వ్యాపారం పరంగా, అంతరిక్ష రంగం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సిన రంగం కాబట్టి, ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రారంభ దశలో పలు సంస్థలు సమ్మిళితంగా (conglomerates) పాల్గొన్నాయి.  

భారతీయ ప్రైవేట్ సంస్థలు సాధారణంగా ప్రధానంగా విడి భాగాలు (Components) మరియు ఉపవ్యవస్థల (subsystems) సరఫరా చేస్తాయి. ఉపగ్రహ-ఆధారిత సేవలు మరియు భూ-ఆధారిత వ్యవస్థల విభాగాలలో అవి పోటీ పడలేవు. అలాగే, భారతీయ కంపెనీలకు స్వతంత్ర అంతరిక్ష ప్రాజెక్టులను చేపట్టే లేదా అంతరిక్ష ఆధారిత సేవలను అందించే వనరులు మరియూ సాంకేతికత లేదు. ఇస్రో సాంప్రదాయ విక్రేత-సరఫరాదారు నమూనాపై (vendor-supplier model) పనిచేస్తున్నందున, మేధో సంపత్తి (Intelectual property) అంతా  సంస్థ అధీనంలోనే ఉన్నది. ఒక విధంగా ఇప్పటి వరకూ ఇది భారతీయ కంపెనీల సాంకేతిక పురోగతికి ఆటంకం కలిగించిందని చెప్పవచ్చు



సముచిత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో ప్రైవేటు రంగం వేగంగా అడుగులు వేస్తున్నది. నావిగేషన్, రిమోట్ సెన్సింగ్, వాతావరణ పర్యవేక్షణ, వ్యవసాయం, శాటిలైట్ కమ్యూనికేషన్ మరియు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌తో సహా పలు రంగాలలో కార్యకలాపాలలో ప్రైవేటు సంస్థలు విప్లవాత్మక మార్పులు చేస్తున్నాయి. తగిన విధివిధానాలు మరియు నిబంధనలతో  ప్రైవేటు రంగం ఇస్రోకు  భాగస్వామి అవుతున్నదిభద్రతా సవాళ్లను ఎదుర్కోవటానికి బలమైన ప్రైవేట్ రంగం కూడా దోహదం చేస్తుంది. వివిధ సంబంధిత రంగాలలో సామర్థ్యాలను పెంచడం, ప్రత్యామ్నాయ అంతరిక్ష ప్రయోగ ఎంపికలు, వాణిజ్యపరంగా లభించే స్వదేశీ ఉపగ్రహ కమ్యూనికేషన్ పరిష్కారాలు, భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలలో పరిశోధన-అభివృద్ధి, ట్రాకింగ్ సామర్థ్యాలు మరియు అంతరిక్ష ఆస్తుల రక్షణపై సమిష్ఠి దృష్టి పెట్టాలి

క్రమేణా ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష-ఆధారిత అనువర్తనాలు మరియు సేవలను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఆవిష్కరణలను తీసుకు వచ్చే అవకాశాలు పెరుగున్నాయి. సేవలకు  ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో గిరాకీ పెరుగుతున్నది. ఉపగ్రహ డేటా, ఛాయా చిత్రాలు (imageries) మరియు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం చాలా రంగాలలో ఉపయోగించబడుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, ప్రస్తుత ప్రైవేట్ భాగస్వామ్యం 70% కు  విస్తరించాల్సి ఉంటుంది. భారతదేశంలో ప్రస్తుతం రాకెట్  మరియు ఉపగ్రహ ప్రాజెక్టులలో 40+ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది

అంతరిక్ష రంగ సంస్కరణలు :

అంతరిక్ష రంగ సంస్కరణలకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని కేంద్ర క్యాబినెట్ 2020 లో ఆమోదించింది. తద్వారా, రాకెట్లు మరియు ఉపగ్రహాలను నిర్మించడం/అభివృద్ధి చేయడం, ప్రయోగ సేవలను అందించడం వంటి అనేక రకాల అంతరిక్ష కార్యకలాపాలలో పాల్గొనడానికి లేదా చేపట్టడానికి  ప్రైవేటు రంగానికి వీలు కలిగింది. దీని ద్వారా, ప్రైవేట్ వ్యాపారాలు ఆర్ అండ్ డి కార్యకలాపాలను నిర్వహించగలుగుతున్నాయి. వివిధ సైన్స్ మరియు ఇంటర్ ప్లానెటరీ మిషన్లపై ఇస్రోతో సహకరించగలవు మరియు ఇస్రో యొక్క సౌకర్యాలను ఉపయోగించుకోగలవు. తద్వారా ఇస్రో సంస్థ ఆర్ అండ్ డి, శాస్త్రీయ మిషన్లు మరియు అంతరిక్ష అన్వేషణలపై దృష్టి పెట్టడానికి అవకాశం ఏర్పడింది.  

ప్రభుత్వం పరిశ్రమల నిర్మాణాత్మక ప్రమేయం కోసం విధివిధానాలను రూపొందించింది. పటిష్టమైన టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ మెకానిజం ద్వారా ఇస్రో అభివృద్ధి చేసిన సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా వాణిజ్య అనువర్తనాలు/స్పిన్-ఆఫ్‌లను కనుగొనడంలో పరిశ్రమను ఇస్రో ప్రోత్సహిస్తుందివిదేశీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, వ్యయాన్ని ఆదా చేయడానికి మరియు ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి విడి భాగాలు మరియు పరికరాలను దేశీయంగా తయారు చేయడంపై ఇస్రో దృష్టి కేంద్రీకరిస్తున్నది.

అంతరిక్ష శాఖను బలోపేతం చేయడానికి మరియు ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలను ప్రోత్సహించడానికి  ఇన్-స్పేస్ మరియూ ఎన్.ఎస్..ఎల్  కొత్త ఏజెన్సీలు ఏర్పడ్డాయి

ఇన్-స్పేస్

సంస్కరణలను కొత్త నోడల్ ఏజెన్సీ, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) అమలు చేస్తుంది. ప్రైవేటు రంగ కార్యకలాపాలను నియంత్రించడానికి మరియు అనుమతించడానికి ఇన్-స్పేస్ బాధ్యత వహిస్తుందిభద్రత, చట్టపరమైన ప్రమోషన్ కార్యకలాపాలు మరియు పర్యవేక్షణ ప్రయోజనాల కొరకు   స్వంత డైరెక్టరేట్‌లను నియమిస్తుంది. స్నేహపూర్వక నియంత్రణ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో నుండి ప్రైవేట్ సంస్థలకు  బదిలీ చేయడం ద్వారా ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కూడా ఇన్-స్పేస్ సంస్థ బాధ్యత వహిస్తుంది

ఎన్.ఎస్..ఎల్

ఇస్రో యొక్క వాణిజ్య కార్యకలాపాలు ప్రభుత్వ యాజమాన్యంలోని యూనిట్ - న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్.ఎస్..ఎల్) అప్పగించబడ్డాయి. ఎన్.ఎస్..ఎల్ తన అంతరిక్ష కార్యకలాపాలనుసరఫరా-ఆధారిత మోడల్ప్రకారం కాకుండాడిమాండ్-ఆధారిత మోడల్పై కొనసాగిస్తుంది. మరియూ, అంతరిక్ష ఆస్తుల వాంఛనీయ వినియోగాన్ని నిర్ధారిస్తుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని వాణిజ్య సంస్థ పాత్రలో, అంతరిక్ష సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనడానికి లేదా అంతరిక్ష వనరులను ఉపయోగించాలనుకునే ప్రైవేట్ సంస్థలకు, ఇస్రో మధ్య సంధాన కర్తగా కూడా పనిచేస్తుంది. అంతరిక్ష పరిశ్రమలో ఉత్పత్తులు మరియు సేవల ప్రోత్సాహం మరియు వాణిజ్యీకరణకు కూడా ఇది బాధ్యత వహిస్తుంది. అదనంగా, ఇస్రో యొక్క బాధ్యతలు-కార్యాచరణ ప్రయోగ వాహనాలు, ఉపగ్రహాలు మరియు వాణిజ్య కార్యకలాపాలు, పరిశ్రమ కన్సార్టియా రూపంలో అమలు చేసే  భాద్యతను  ఎన్.ఎస్..ఎల్ వహిస్తున్నది. ఇస్రో  వాణిజ్య వ్యవహారాలను గతంలో పర్యవేక్షించిన ఆంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్  ఎన్.ఎస్..ఎల్ లో విలీనం చేయబడింది.  

ప్రభుత్వం అంతరిక్ష రంగంలో  ప్రైవేటు భాగస్వామ్యానికి  అనుమతించిన కొన్ని నెలల్లోనే, ఇన్-స్పేస్ భారత మరియు విదేశీ సంస్థల నుండి కనీసం 26 ప్రతిపాదనలను అందుకుంది. ప్రతిపాదనలు గ్రౌండ్ స్టేషన్ల ఆమోదం, ఉపగ్రహ సనుదాయాలను ఏర్పాటు చేయడం, ఉపగ్రహాలను అభివృద్ధి చేయడం మరియు ప్రయోగించడం మరియు వాహనాలను ప్రయోగాలు చేయడం వరకు ఉన్నాయి. అంతేకాకుండా, యుఎస్ ఆధారిత అమెజాన్ వెబ్ సర్వీసెస్, యుకె ఆధారిత వన్‌వెబ్ (భారతి గ్రూప్ మద్దతుతో), టాటా యొక్క నెల్కో మరియు ఎల్ అండ్ టి వంటి సంస్థలు రంగంపై ఆసక్తి చూపించాయితమ ప్రయోగ వాహనం / రాకెట్ అభివృద్ధి కార్యక్రమానికి ఇస్రో సౌకర్యాలను ఉపయోగించుకీవడానికి  మరియు సాంకేతిక నైపుణ్యాన్ని పొందడానికి, చెన్నైకి చెందిన చిన్న రాకెట్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్‌  ఒప్పందం చేసుకున్నది


ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌ను  (.ఎస్. పి. ) 


భారతదేశంలో అంతరిక్ష సాంకేతికతను పెంచడానికి సహాయపడే ఒక ప్రైవేట్ పరిశ్రమ సంస్థ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ నవంబర్ 2021లో ప్రారంభమైయిందిఇది అంతరిక్ష సాంకేతికత మరియు డొమైన్ చుట్టూ ఉన్న పాలసీ సమస్యపై ఇస్రో మరియు ఇతర ఏజెన్సీలతో సహకరిస్తుందిభారతదేశంలో కెపాసిటీ బిల్డింగ్ మరియు స్పేస్ ఎకనామిక్ హబ్‌లు మరియు ఇంక్యుబేటర్లపై .ఎస్. పి. దృష్టి పెడుతుందివన్‌వెబ్, భారతీ ఎయిర్‌టెల్, మ్యాప్‌మిండియా, వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్, లార్సన్ & టూబ్రో మరియు నెల్కో (టాటా గ్రూప్) సంస్థలు వ్యవస్థాపక సభ్యులు కాగా, గోద్రెజ్, హ్యూస్ ఇండియా, అజిస్టా-బిఎస్‌టి ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, బి..ఎల్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, మక్సార్ ఇండియా  సంస్థలు అసోసియేషన్ యొక్క ప్రధాన సభ్యులు.


ఇప్పటికే పలు అంకుర సంస్థలు (స్టార్ట్ అప్స్) ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యక్రమాలలో పని చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి: స్కైరూట్ ఏరోస్పేస్ (హైద్రాబాద్), ధ్రువ స్పేస్ (హైద్రాబాద్), పిక్సెల్ (బెంగుళూరు), అగ్నికుల్ (చెన్నై), యాస్ట్రోం (బెంగుళూరు), కవా స్పేస్ (ముంబాయి), సాటెలైజ్ (ముంబాయి), బెల్లాట్రెక్స్ ఏరోస్పేస్ (బెంగుళూరు), టీం ఇండస్ మూన్ షాట్ (బెంగుళూరు).

ఆయా కంపెనీలు పెడుతున్న పెట్టుబడి, రూపొందించే అంతరిక్ష  సంబంధిత రాకెట్లు/ సూక్ష్మ ఉపగ్రహాలు/ఉపకరణాల వివరాలను ఈ  10 నిమిషాల వీడియోలో, క్రింద ఇచ్చిన లింక్ ద్వారా  వీక్షించండి. 



రాబోయే రోజుల్లో ...

మన ప్రైవేట్ పారిశ్రామిక రంగం యొక్క సాంకేతిక పురోగతి మరియు విస్తరణలో అంతరిక్ష రంగం ప్రధాన ఉత్ప్రేరక పాత్ర పోషిస్తుంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పరిశ్రమలు, విద్యా సంస్థలు మరియు పరిశోధనా సంస్థల అధిక భాగస్వామ్యం కొరకు  ఇన్-స్పేస్  పని చేస్తుంది.

అంతరిక్ష రంగంలో అధునాతన సామర్థ్యాలు కలిగిన కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి సంస్కరణలతో, రంగం కొత్త శక్తిని మరియు చైతన్యాన్ని పొందుతుంది. అంతరిక్ష కార్యకలాపాల యొక్క తదుపరి దశలకు దేశం దూసుకుపోవడానికి సహాయపడుతుంది.